Vastu: వాస్తు ప్రకారం ఈ 6 తప్పులు చేయకండి.. పర్సులో వీటిని తొలగిస్తే ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడచ్చు.. లేదంటే ధన నష్టం
Vastu: వాస్తు ప్రకారం మంచి జరగాలన్నా, సానుకూల శక్తి ప్రవహించాలన్నా ఈ పొరపాట్లు చేయడం మంచిది కాదు. మరి ఎటువంటి తప్పులు చేయకూడదనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలిసి చేసినా, తెలియక చేసినా డబ్బుకు సంబంధించి కొన్ని పొరపాట్లు ఆర్థిక నష్టాన్ని తీసుకువస్తాయి.
చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. అలా మనం వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన అనేక సమస్యల నుంచి బయటపడడానికి అవుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. సంతోషంగా జీవించొచ్చు. అయితే, వాస్తు ప్రకారం డబ్బుకి సంబంధించి కొన్ని పొరపాట్లు చేయడం మంచిది కాదు. దాని వలన చాలా నష్టం కలుగుతుంది.

వాస్తు ప్రకారం మంచి జరగాలన్నా, సానుకూల శక్తి ప్రవహించాలన్నా ఈ పొరపాట్లు చేయడం మంచిది కాదు. మరి ఎటువంటి తప్పులు చేయకూడదనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలిసి చేసినా, తెలియక చేసినా డబ్బుకు సంబంధించి కొన్ని పొరపాట్లు ఆర్థిక నష్టాన్ని తీసుకువస్తాయి. కాబట్టి ఇటువంటి వాటిని అస్సలు జరగకుండా చూసుకోవడం మంచిది.
- విరిగిపోయిన అద్దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచకూడదు. ఇటువంటి వాటిని ఇంట్లో ఉంచడం వలన ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది. కాబట్టి విరిగిపోయిన అద్దాన్ని వెంటనే ఇంటి నుంచి తొలగించడం మంచిది.
- ఇంట్లో మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కాస్మొటిక్స్, ఆభరణాలు వంటి వాటితో పాటు డబ్బుని కలిపి పెట్టొద్దు. ఎందుకంటే ఇది ఆర్థిక ఇబ్బందుల్ని తీసుకు వస్తాయి. చెడు ప్రభావం పడేటట్టు చేస్తాయి.
- తప్పుదారిలో సంపాదించిన డబ్బు లేదా బంగారాన్ని నిజాయితీగా సంపాదించిన డబ్బుతో పెట్టొద్దు. అలా చేయడం వలన పేదరికాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెడ్డ పనుల ద్వారా సంపాదించుకున్న డబ్బుని ఎప్పుడూ కూడా ఇలా పెట్టకండి. ఆనందాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ధన నష్టం కూడా కలుగవచ్చు.
- కొంతమంది పర్సులో చిన్న చిన్న కత్తులు వంటివి పెడుతూ ఉంటారు. ఇలాంటి వాటిని పర్సులో ఉంచడం వలన కూడా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- పర్సులో ముఖ్యమైన వాటిని మాత్రమే పెట్టుకోవాలి. చాలా మంది పనికిరాని కాగితాలు, బిల్లులు, టికెట్లు వంటివి ఉంచుతారు. దీని వలన సానుకూల శక్తి తొలగి, ప్రతికూల శక్తి కలుగుతుంది. ఆర్థిక నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- నల్లటి రంగు క్లాత్ ని కూడా పర్సులో ఉంచుకోకూడదు. ఇది కూడా ఆర్థిక నష్టాన్ని తీసుకు వస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం