Vastu Tips: పూజగదిలో పెట్టకూడని దేవుళ్ల ఫోటోలు ఇవిగో, ఉంటే వెంటనే తీసేయండి-vastu tips to follow in pooja mandir ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: పూజగదిలో పెట్టకూడని దేవుళ్ల ఫోటోలు ఇవిగో, ఉంటే వెంటనే తీసేయండి

Vastu Tips: పూజగదిలో పెట్టకూడని దేవుళ్ల ఫోటోలు ఇవిగో, ఉంటే వెంటనే తీసేయండి

Peddinti Sravya HT Telugu
Dec 07, 2024 12:00 PM IST

Vastu Tips: చాలామందికి ఎటువంటి ఫోటోలను పూజ మందిరంలో పెట్టుకోకూడదు అనేది తెలియదు. కొన్నిటిని పెట్టడం వలన సానుకూల శక్తి తొలగిపోయి, ప్రతికూల శక్తి కలుగుతుంది. అలాగే ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూజ మందిరంలో చేసే పొరపాట్లు మనపై ప్రభావం పడతాయి.

పూజగదిలో పెట్టకూడని దేవుళ్ల ఫోటోలు ఇవిగో, ఉంటే వెంటనే తీసేయండి
పూజగదిలో పెట్టకూడని దేవుళ్ల ఫోటోలు ఇవిగో, ఉంటే వెంటనే తీసేయండి

వాస్తు ప్రకారం అనుసరించడం వలన మంచి జరుగుతుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. హిందూమతంలో 33 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు. మన ఇంటి పూజ గదిలో మనకు ఇష్టమైన దేవుళ్ళ ఫోటోలను, దేవతల ఫోటోలని పెడుతూ ఉంటాము. రోజూ దీపారాధన చేసి పూజ చేస్తూ ఉంటాము. అయితే, చాలామందికి ఎటువంటి ఫోటోలను పూజ మందిరంలో పెట్టుకోకూడదు అనేది తెలియదు.

yearly horoscope entry point

కొన్నిటిని పెట్టడం వలన సానుకూల శక్తి తొలగిపోయి, ప్రతికూల శక్తి కలుగుతుంది. అలాగే ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూజ మందిరంలో చేసే పొరపాట్లు మనపై ప్రభావం పడతాయి. కాబట్టి తప్పులు చేస్తున్నట్లయితే సరి చేసుకోవడం మంచిది.

పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు చేయకండి

శని దేవుడు ఫోటో

పూజ గదిలో ఎప్పుడూ కూడా శని దేవుడు ఫోటో ఉండకూడదు. శని దేవుడిని పూజ గదిలో పెట్టి పూజించకూడదు. ఈ తప్పును చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు పెట్టుకోండి.

కాళీమాత

ఎలా అయితే శని దేవుడు ఫోటోని పూజ మందిరంలో పెట్టి పూజించకూడదు. అలాగే కాళీమాత ఫోటోని కూడా పూజ మందిరంలో పెట్టి పూజించకూడదు. వాస్తు శాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. కాళీమాత విగ్రహం లేదా ఫోటోని పూజ మందిరంలో పెట్టి పూజించడం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాలభైరవుడు

పూజ మందిరంలో కాలభైరవుడు ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టి పూజించకూడదు. ఎక్కువగా తంత్ర విద్యలో కాలభైరవుడని ఆరాధిస్తారు. కనుక పూజ గదిలో ఈ ఫోటోని కూడా పెట్టకండి.

మహిషాసుర మర్దిని

మహిషాసుర మర్దిని అవతారంలో దుర్గాదేవి రాక్షసుల్ని చంపుతారు. కాబట్టి ఇలాంటి ఉగ్రరూపం దాల్చిన దుర్గాదేవి ఫోటోలని కూడా పూజ గదిలో పెట్టి పూజించకూడదు. ఈ తప్పు చేస్తే కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బ్రహ్మదేవుడు

బ్రహ్మదేవుడు లోకాలకు అధిపతి. పూజ గదిలో బ్రహ్మదేవుడు ఫోటో పెట్టి పూజించకూడదు. తల్లి సావిత్రి శాపం వలన బ్రహ్మదేవుడుని పూజించకూడదని పురాణాల్లో చెప్పబడింది.

ఈ దిక్కులో పూజ మందిరాన్ని ఉంచుకోండి:

పూజ మందిరం ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ దిక్కులో పూజ మందిరం ఉంటే ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు. ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి పూజ మందిరాన్ని ఇంట్లో నిర్మించేటప్పుడు, కచ్చితంగా ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం