Vastu: కారులో ఈ 6 వస్తువులను పెడితే.. అడ్డంకులు తొలగిపోతాయి-vastu tips to follow in car keep these things and get positive energy happiness and obstacles will remove ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu: కారులో ఈ 6 వస్తువులను పెడితే.. అడ్డంకులు తొలగిపోతాయి

Vastu: కారులో ఈ 6 వస్తువులను పెడితే.. అడ్డంకులు తొలగిపోతాయి

Peddinti Sravya HT Telugu
Jan 15, 2025 03:00 PM IST

Vastu: వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండడానికి కూడా అవుతుంది.

Vastu: కారులో ఈ 6 వస్తువులను పెడితే.. అడ్డంకులు తొలగిపోతాయి
Vastu: కారులో ఈ 6 వస్తువులను పెడితే.. అడ్డంకులు తొలగిపోతాయి

చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండడానికి కూడా అవుతుంది. వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసినట్లయితే ఎంతో మంచి జరుగుతుంది. సానుకూల శక్తి కలుగుతుంది.

వాస్తు ప్రకారం కారులో ఎలాంటి వస్తువులను ఉంచాలో తెలుసుకుందాం

కారులో వీటిని కనుక మీరు పెట్టినట్లయితే మీ కారులో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అలాగే వీటిని ఉంచడం వలన ప్రయాణం సమయంలో ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. మంచి ఎనర్జీ ప్రవహిస్తుంది కాబట్టి సంతోషంగా ఉండొచ్చు. హాయిగా ప్రయాణం చేయొచ్చు.

వాస్తు ప్రకారం కారులో ఉంచుకోవాల్సిన వస్తువులు

ఈ వస్తువులను కారులో పెడితే అడ్డంకులు తొలగిపోయి, సంతోషం కలుగుతుంది. మరి ఇక ఏయే వాటిని పెడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

1.వినాయకుడి విగ్రహం

వినాయకుడు విఘ్నాలను తొలగిస్తారు. వినాయకుడి విగ్రహాన్ని కారులో ఉంచడం వలన మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అడ్డంకులు తొలగిపోయి సంతోషంగా ఉండడానికి అవుతుంది.

2.హనుమంతుని విగ్రహం

చాలా మంది ఇలాంటి విగ్రహాన్ని చూసే ఉంటారు, కారులో వేలాడుతున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెడుతూ ఉంటారు. ఈ విగ్రహాన్ని పెడితే కూడా సానుకూల శక్తి కలుగుతుంది. నిజానికి ఇది శుభప్రదంగా భావిస్తారు. దీనిని ఉంచడం వలన చెడు ప్రభావాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. హనుమంతుడు మనల్ని రక్షిస్తారు, కాబట్టి కారులో వేలాడుతున్న హనుమంతుని విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు.

3.నల్లని తాబేలు

మంచి జరగడానికి సానుకూల శక్తి కలగడానికి కారులో చిన్న నల్ల తాబేలు ఉంచండి. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సంతోషంగా ఉండొచ్చు,

4.సహజమైన స్పటికాలు

కారులో సహజమైన స్పటికాలని పెడితే కూడా ఎంతో శుభప్రదం. వీటిని ఉంచడం వలన కారు ఎల్లప్పుడూ వసురక్షితంగా ఉండడమే కాకుండా భూమి మూలకాన్ని బలపరుస్తుంది. కాబట్టి కారులో సహజమైన స్పటికాలని కూడా పెట్టండి. కారులో ఉంటే సానుకూల శక్తి ప్రవహించే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండొచ్చు. హాయిగా ప్రయాణం చేయవచ్చు.

5.మంచి నీళ్లు

కారులో మంచి నీళ్లు ఉంటే మంచి జరుగుతుంది, మనసును బలోపేతం చేయడమే కాకుండా మంచి నిర్ణయాలను తీసుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి కారులో మంచినీళ్ళని కూడా పెట్టుకోండి.

6.రాక్ సాల్ట్

రాక్ సాల్ట్ లో కొంచెం బేకింగ్ సోడా కలిపి ఒక కాగితంలో చుట్టి కారు సీటు కింద పెట్టండి. ప్రతికూలతని తొలగించి సానుకూల శక్తిని పొందడానికి అవుతుంది. మధ్య మధ్యలో దీనిని మారుస్తూ ఉంటే మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం