Vastu: 5 రూపాయలు విలువైన ఈ వస్తువును బాత్రూంలో ఉంచండి.. వాస్తు దోషాలు తొలగిపోతాయి.. ఏ ఇబ్బందులూ ఉండవు-vastu tips to follow in bathroom keep this one thing which worth five rupees ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu: 5 రూపాయలు విలువైన ఈ వస్తువును బాత్రూంలో ఉంచండి.. వాస్తు దోషాలు తొలగిపోతాయి.. ఏ ఇబ్బందులూ ఉండవు

Vastu: 5 రూపాయలు విలువైన ఈ వస్తువును బాత్రూంలో ఉంచండి.. వాస్తు దోషాలు తొలగిపోతాయి.. ఏ ఇబ్బందులూ ఉండవు

Peddinti Sravya HT Telugu
Jan 06, 2025 02:12 PM IST

Vastu: చాలా మంది వాస్తు ప్రకారం ఇంట్లో రకరకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు. అనేక మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న మార్పులు మన ఇంట్లో ఎక్కువ ప్రయోజనాలని పొందవచ్చు.

Vastu: 5 రూపాయలు విలువైన ఈ వస్తువును బాత్రూంలో ఉంచండి
Vastu: 5 రూపాయలు విలువైన ఈ వస్తువును బాత్రూంలో ఉంచండి (pinterest)

వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయి. సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలా మంది వాస్తు ప్రకారం ఇంట్లో రకరకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు. అనేక మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న మార్పులు మన ఇంట్లో ఎక్కువ ప్రయోజనాలని పొందవచ్చు.

yearly horoscope entry point

వాస్తు ప్రకారం అనుసరించడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కవచ్చు. వాస్తు ప్రకారం ఈ చిన్న మార్పు చేసినట్లయితే, ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషాలు తొలగించడానికి వాష్ బేసిన్ వద్ద ఈ ఒకటి ఉంచితే మంచి జరుగుతుంది.

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసి చూడండి

  1. వాస్తు ప్రకారం బాత్రూం లో ఉండే వాష్ బేసిన్ ని తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉంచడం మంచిది. అలాగే బాత్రూమ్ లో బాత్ టబ్ ని ఈశాన్యం వైపు ఉంచడం మంచిది.

2. ఎలక్ట్రానిక్ పరికరాలని ఆగ్నేయం వైపు ఉంచడం మంచిది.

3. ఇక బకెట్ రంగు విషయానికి వస్తే నీలం రంగు బకెట్ ని బాత్రూం లో ఉంచడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది.

4. నీలం రంగు సానుకూల శక్తిని తీసుకురావడానికి సహాయపడుతుంది.

5. అలాగే బాత్రూం గోడల విషయానికొస్తే కొంచెం లైట్ కలర్స్ ని ఉపయోగించడం మంచిది.

6. బాత్రూం లో ఉండే టైల్స్ కూడా లైట్ కలర్ లో ఉండడం మంచిది. దీని వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది.

ఒక గిన్నెలో ఉప్పు

వాస్తు దోషాలను తొలగించడానికి ఒక చిన్న గిన్నెలో ఉప్పు వేసి ఉంచడం మంచిది. ప్రతి వారం ఈ ఉప్పుని మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇంట్లో సంతోషం ఉంటుంది.

పిరమిడ్

పిరమిడ్ వాస్తు దోషాలని తొలగిపోవడానికి బాత్రూంలో ఉన్న దక్షిణం గోడకు పిరమిడ్ ని ఉంచడం మంచిది. అలా చేయడం వలన వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. సానుకూల శక్తి ప్రవహించడానికి కూడా సహాయపడుతుంది. ఇలా ఇక్కడ చెప్పిన వాటిని అనుసరించినట్టైతే వాస్తు దోషాలు తొలగిపోతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం