Vastu Tips: ఆర్థిక ఇబ్బందులా? వాస్తు ప్రకారం ఈ మార్పులు చేస్తే సంపద కలిగి సంతోషంగా ఉండొచ్చు-vastu tips to follow for wealth and these will helps to attract money and promotes happiness positive energy health ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: ఆర్థిక ఇబ్బందులా? వాస్తు ప్రకారం ఈ మార్పులు చేస్తే సంపద కలిగి సంతోషంగా ఉండొచ్చు

Vastu Tips: ఆర్థిక ఇబ్బందులా? వాస్తు ప్రకారం ఈ మార్పులు చేస్తే సంపద కలిగి సంతోషంగా ఉండొచ్చు

Peddinti Sravya HT Telugu

Vastu Tips: చాలా మంది ఆర్థిక ఇబ్బందులు, ఈతి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చక్కటి సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోయి, సంతోషంగా ఉంటారు. మరి వాస్తు ప్రకారం ఎటువంటి మార్పులు చేసుకుంటే, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

Vastu Tips: ఆర్థిక ఇబ్బందులా? వాస్తు ప్రకారం ఈ మార్పులు చేస్తే సంపద కలిగి సంతోషంగా ఉండొచ్చు (pinterest)

ఒక్కోసారి కష్టాలన్నీ మన మీదే వచ్చి పడినట్లు అనిపిస్తూ ఉంటుంది. కష్టాల నుంచి బయటకు రావడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. వచ్చిన డబ్బు మంచి నీరులా ఖర్చు అయిపోతూ ఉంటుంది. పొదుపు చేసే ప్రసక్తే లేక పోతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోవాల్సి వస్తుంది. మీరు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో పడి సతమతమవుతున్నారా? ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలనుకుంటున్నారా? అయితే, కచ్చితంగా ఈ చిన్న చిన్న మార్పులు చేయాల్సిందే.

వాస్తుతో ఆర్థిక ఇబ్బందులకు చెక్:

చాలా మంది ఆర్థిక ఇబ్బందులు, ఈతి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు వాస్తు ప్రకారం అనుసరించడం వలన మంచి జరుగుతుంది. చక్కటి సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోయి, సంతోషంగా ఉంటారు. మరి వాస్తు ప్రకారం ఎటువంటి మార్పులు చేసుకుంటే, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఈ రంగులతో సమస్యల నుంచి బయటపడవచ్చు

వాస్తు ప్రకారం ఈ రంగులు చాలా మార్పును తీసుకువస్తాయి. ఎరుపు రంగు, వంకాయ రంగు, ఆకుపచ్చ రంగు వాస్తు రంగులు. ఈ రంగు వస్తువులను మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన సమస్యల నుంచి గట్టెక్కొచ్చు. ఇంట్లో ఉపయోగించే కుర్చీలు, సోఫాలు వంటివి వాస్తు రంగులతో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు.

ఈ మార్పులతో సమస్యలు తొలగిపోవచ్చు

ఇంటి ఉత్తర భాగంలో నీలం కలర్ పిరమిడ్ ఉంచండి. ఇది ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించి, సంపదని పెంచుతుంది. అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది.

ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. సూర్యాస్తమయం అవ్వక ముందే ఇంటిని తుడుచుకోవడం, ఎప్పటికప్పుడు ఇంట్లో వస్తువులను సర్దుకోవడం వంటివి చాలా అవసరం. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది.

బంగారం రంగులో ఉండే బుద్ధుని విగ్రహాన్ని కూడా ఇంట్లో పెడితే మంచిది. ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు. తులసి మొక్కని, ఉసిరి మొక్కని ఇంటి ఉత్తరం వైపు నాటితే మంచి జరుగుతుంది. అలాగే మనీ ప్లాంట్ ని కూడా మీరు ఇంట్లో ఉంచితే సంతోషం కలిగి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

ఇంట్లో అక్వేరియం ఉంటే ఉత్తరం వైపు ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట సిరులు కురిపిస్తుంది. వంటగదిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి విగ్రహం, వినాయకుడి విగ్రహం తూర్పు, ఉత్తర దిశల్లో ఉంటే మంచి జరుగుతుంది. సంపద పెరుగుతుంది. ఉపయోగం లేని వస్తువులు, విరిగిపోయిన సామాన్లు వంటివి ఇంట్లో ఉండకుండా చూసుకోండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

సంబంధిత కథనం