Vastu: వాస్తు ప్రకారం ఫ్యామిలీ ఫోటోని ఏ దిశలో పెట్టాలి? ఎలాంటి లాభాలను పొందవచ్చో తెలుసా?-vastu tips to be followed while keeping family photo at home and do these changes for positive energy and happiness ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu: వాస్తు ప్రకారం ఫ్యామిలీ ఫోటోని ఏ దిశలో పెట్టాలి? ఎలాంటి లాభాలను పొందవచ్చో తెలుసా?

Vastu: వాస్తు ప్రకారం ఫ్యామిలీ ఫోటోని ఏ దిశలో పెట్టాలి? ఎలాంటి లాభాలను పొందవచ్చో తెలుసా?

Peddinti Sravya HT Telugu
Published Feb 11, 2025 03:00 PM IST

Vastu: వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం, కుటుంబ సభ్యుల ఫోటోలు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలని చూద్దాం.

Vastu: వాస్తు ప్రకారం ఫ్యామిలీ ఫోటుని ఏ దిశలో పెట్టాలి?
Vastu: వాస్తు ప్రకారం ఫ్యామిలీ ఫోటుని ఏ దిశలో పెట్టాలి? (pinterest)

చాలామంది వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఫాలో అయితే అనేక సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు. వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం, కుటుంబ సభ్యుల ఫోటోలు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలని చూద్దాం.

వీటి ప్రకారం ఫాలో అవ్వడం వలన సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం మనం ఇంట్లో వస్తువులను పెట్టుకోవాలి. ఒకవేళ వాస్తుకి సంబంధించి ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వాస్తు ప్రకారం ఫ్యామిలీ ఫోటోలని ఏ దిశలో పెట్టుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

ఫ్యామిలీ ఫోటోల వెనుక ఇంత ఉద్దేశం ఉందా?

ఫ్యామిలీ ఫోటోలని ఇంటికి చాలా మంది అలంకరణగా వాడుతూ ఉంటారు. ఇది ప్రేమ, ఐక్యత, ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలకు శక్తివంతమైనవి. వాస్తు ప్రకారం ఈ చిత్రాలు ఇంట్లో శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి.

ఈ ఫోటోలు సరైన దిశలో ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కనెక్షన్ బాగుంటుంది. అలాగే సంతోషకరమైన క్షణాలని సూచించే చిత్రాలు ఉంటే సానుకూల శక్తిని తీసుకువస్తాయి.

వాస్తు ప్రకారం వీటిని ఏ దిశలో ఉంచాలి?

వాస్తు ప్రకారం, ఫ్యామిలీ ఫోటోలను ఎప్పుడూ కూడా సరైన దిశలో ఉంచాలి. అలా చేయడం వలన సానుకూల శక్తి కలుగుతుంది. ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు.

1.లివింగ్ రూమ్

లివింగ్ రూమ్ ఎక్కువగా కుటుంబ సభ్యులు, అతిథులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కుటుంబ చిత్రాలని లివింగ్ రూమ్ లో పెట్టినప్పుడు ఉత్తరం లేదా తూర్పు గోడపై ఉంచడం వలన సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. బంధాలని బలోపేతం చేయొచ్చు.

2.బెడ్ రూమ్

బెడ్ రూమ్ లో నైరుతి గోడకు కుటుంబ సభ్యుల ఫోటో పెడితే మంచిది. ఇది మీ భాగస్వామికి, మీకు మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది.

3.ప్రవేశ ద్వారం

ఇంటి ముఖద్వారం దగ్గర ఫోటోలని పెట్టినప్పుడు లేదా హాలులో పెడితే సానుకూల శక్తి వస్తుంది. అతిధులకి స్వాగతించే వాతావరణాన్ని సృష్టించొచ్చు.

4.డైనింగ్ ఏరియా

డైనింగ్ ఏరియాలో ఫ్యామిలీ ఫోటోలను పెట్టొచ్చు. ఇక్కడ అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫోటోలని పెట్టడం వలన సానుకూలతను పెంపొందించుకోవచ్చు.

ఇలాంటి ఫోటోలని పెట్టకండి

కుటుంబ సభ్యుల ఫోటోలని పెట్టినప్పుడు కొన్ని తప్పులు కూడా చేయకూడదు. కొన్ని ఫోటోలు పెడితే సానుకూల శక్తి రాదు. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఉదాహరణకు దుఃఖం, ఒంటరితనం, బాధలను సూచించే చిత్రాలని అసలు పెట్టకూడదు. ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. మరణించిన కుటుంబ సభ్యుల ఫోటోలని సాధారణ నివాస ప్రాంతాల్లో ఉంచకూడదు. బదులుగా వాటిని పూజగది లేదా జ్ఞాపకార్థం కోసం ప్రత్యేక స్థలంలో వాటిని పెట్టొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం