షాపు లేదా ఆఫీసులో ఎటువంటి వాస్తు నియమాలను పాటించాలి? ఇలా చేస్తే ఆర్థిక సమస్యలే ఉండవు!-vastu tips to be followed in shop and office do these for wealth success ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  షాపు లేదా ఆఫీసులో ఎటువంటి వాస్తు నియమాలను పాటించాలి? ఇలా చేస్తే ఆర్థిక సమస్యలే ఉండవు!

షాపు లేదా ఆఫీసులో ఎటువంటి వాస్తు నియమాలను పాటించాలి? ఇలా చేస్తే ఆర్థిక సమస్యలే ఉండవు!

Peddinti Sravya HT Telugu

వాస్తు శాస్త్రంలో షాపు, ఆఫీసుకు సంబంధించి అనేక రకాలైన పరిహారాలను పాటిస్తారు. వాస్తు నియమాలను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా, ఒక వ్యక్తి విజయాలను అందుకోవచ్చు. షాపు లేదా ఆఫీసుకి సంబంధించి వాస్తు సరిగ్గా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది.

షాపు లేదా ఆఫీసులో ఎటువంటి వాస్తు చిట్కాలను పాటించాలి?

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు శాస్త్రంలో షాపు, ఆఫీసుకి సంబంధించి అనేక రకాలైన పరిహారాలు వున్నాయి. వాస్తు నియమాల ప్రకారం పాటిస్తే, విజయాన్ని చేరుకోవచ్చు.

షాపు లేదా ఆఫీసులో వాస్తు సరిగ్గా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. అదే ఒకవేళ వాస్తు లోపం ఉంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. షాపులో కానీ, ఆఫీసులో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

షాపులో లేదా ఆఫీసులో పాటించాల్సిన వాస్తు నియమాలు

వాస్తు శాస్త్రం ప్రకారం కార్యాలయంలో లేదా షాపులో క్యాష్ మొదలు అకౌంటెంట్ విభాగం వరకు ఇవన్నీ ఉత్తర దిశలో ఉండాలి. అతిథులు కూర్చునే ప్రాంతం వాయవ్య దిశలో ఉండాలి. కార్యాలయం ప్రవేశ ద్వారం ఈశాన్య లేదా వాయవ్య దిశలో ఉండాలి.

మొక్కలు, గడియారం, నోట్ ప్యాడ్, పెన్ను మొదలైన వాటిని ఆఫీసులోని టేబుల్ పై క్రమపద్ధతిలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం అగ్ని దిశలో ఎర్రటి గాజు కప్పులో గోమతి చక్రాలను వేసి ఉంచితే మంచిది.

స్వస్తిక్ గుర్తు

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ సీటు వెనుక కుంకుమతో స్వస్తిక్‌ను ఏదైనా శుభ ముహూర్తం లేదా శుభ నక్షత్రంలో వేయడం మంచిది. ప్రతిరోజూ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు, ఏదైనా తియ్యటివి తిని, నీరు త్రాగి బయలుదేరండి.

డబ్బులు పెట్టే వాల్ట్

వాస్తు శాస్త్రం ప్రకారం, షాపులోని సేఫ్ దక్షిణ లేదా పడమర గోడకు పెట్టడం మంచిది. ఈ ప్రదేశంలో ఉంటే శుభ ఫలితాలను పొందడానికి అవుతుంది.

కౌంటర్

వాస్తు శాస్త్రం ప్రకారం, దుకాణంలోని కౌంటర్ ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి. షాపుకు వచ్చే కస్టమర్లు దక్షిణ లేదా పడమర వైపు ఉండాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.