vastu Shastra:అమ్మకూ, భార్యకూ మధ్య నలిగిపోతున్నారా.. అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించండి
వాస్తు దోషం వల్ల ఆర్థిక సమస్యలే కాదు. వాగ్వాదాలు, గొడవలు, కలహాలు తరచూ జరుగుతుంటాయి. వాటి వల్ల శాంతి, సంతోషాలు దూరమై కలహాలకు కారణమవుతాయి. ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య గొడవలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇటువంటి సమస్యలు దరిచేరకుండా ఈ చిట్కాలు పాటించండి.
అత్తా కోడళ్ల మధ్య ప్రతి ఇంట్లో గొడవలు సహజమే. కానీ ఇవి సాధారణమైనవే అయితే పరవాలేదు. కానీ మితిమీరితే మాత్రం పెద్ద పెద్ద సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఉండే మగవారు నలిగి పోతూ నిత్యం నరకం అనుభవిస్తుంటారు. అలా ఇంట్లో తరచూ తల్లికి, భార్యకు మధ్య గొడవలతో ఇబ్బంది పడుతున్న పురుషులకు ఇదో శుభవార్త. అదృష్టవశాత్తు హిందూ ఆచార వ్యవహారాల్లో ఒకటైన వాస్తు శాస్త్రం దీనికి పరిష్కారం చూపిస్తుంది. మీ ఇంట్లో కొన్ని చిన్న చిన్న వాస్తు మార్పుల వల్ల మీ అమ్మ, భార్యల మధ్య వస్తున్న వివాదాలకు పరిష్కారం దొరుకుతుంది. చిన్న చిన్న సూచనలతో మొత్తం ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా మార్చుకోండి. ఈ 5 వాస్తు సూచనలు పాటించి తల్లికి, భార్యకి మధ్య తగవులు లేకుండా చూసుకోండి.
- గృహ ద్వారం
ఇంట్లోకి అడుగుపెట్టాలంటే ముందుగా కనిపించేది ప్రవేశ ద్వారమే. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటిని చూడగానే సానుకూల పరిస్థితిని నింపేలా గృహ ద్వారం ఉండాలి. ప్రవేశ ద్వారం గుండా ఇంట్లోకి చక్కటి వెలుతురు, గాలి అందేలా చూడండి. ఇలా చేయడం వల్ల వాదనలు లేని వాతావరణం ఏర్పడుతుంది. ఒత్తిడి దూరమై వివాదాలు తగ్గుముఖం పడుతాయి.
- బెడ్ రూం బ్యాలెన్సింగ్
వాస్తు ప్రకారం.. బెడ్ రూం లొకేషన్ అనేది చాలా ముఖ్యం. ప్రత్యేకించి ఇంటి యజమాని నిద్రపోయే గదిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కనుక మీ బెడ్ రూం కచ్చితంగా నైరుతి దిశగా ఉండేలా చూసుకోండి. ఈ స్థానంలో ఉంచడం కుటుంబసభ్యుల మధ్య బంధాలను బలపరుస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే బెడ్‌లు ఈశాన్యంలో అస్సలు ఉండకుండా చూసుకోండి. అది భార్యాభర్తలు, అత్తా కోడళ్లు, అన్నా తమ్ముళ్ల మధ్య అపార్థాలకు, వివాదాలకు కారణమవుతుంది.
- గోడలకు వేసే రంగులు
రంగులు అనేవి మన భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తాయి. ప్రశాంతతను, ఒకరితో ఒకరు సామరస్యంగా మెలిగేందుకు కారణమవుతాయి. అందుకే ప్రశాంతంగా లేదా న్యూట్రల్ రంగులు ఎంచుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లోని గదుల్లో లేత నీలం రంగు, పచ్చ రంగులు ఉండేలా చూసుకొండి. ఈ రంగులు వాదనలు పెరగకుండా, చక్కటి వాతావరణం కలిగేందుకు సహకరిస్తాయి.
- అడ్డంకులు లేకుండా
మీరు నివాసముండే ప్రదేశంలో ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా చూసుకోండి. విరిగిన కుర్చీలు, పనికి రాని వస్తువులను ఇంట్లో అస్సలు ఉండనీయకండి. నిర్మలమైన వాతావరణం, గందరగోళం లేని వాతావరణం ఉండటం వల్ల ఇంట్లో శాంతితో కూడి ఉంటుంది.
వాస్తు మీ ఇంటిలో సానుకూల, ప్రతికూల శక్తులను ప్రభావితం చేస్తుంది. వీటి పర్యావసనాలు ఒక్కోసారి భరించలేని స్థాయిలో ఉండొచ్చు. ఈ సమస్యలకు దూరంగా ఉండేందుకు వాస్తు చిట్కాలు పాటించి జాగ్రత్తలు వహించండి. వాస్తు ప్రకారం.. మీ ఇంట్లో దుష్ట శక్తులను తొలగించుకునేందుకు ఉప్పు ఉపయోగపడుతుంది. మీరు మీ గదిలోని ఒక మూల చిన్న గిన్నెలో రాతి ఉప్పు వేసి ఉంచుకోవాలి. ఫలితంగా ఇంట్లో కలహాలు, ఇబ్బందులు రాకుండా ఉంటుంది. సానుకూల శక్తిని సృష్టిస్తుంది. తద్వారా కుటుంబంలో ఆనందం, శాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకుండా ఉంటుంది.
టాపిక్