Vastu Tips: ఈ పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే ధన లాభం, అదృష్టం కలగొచ్చు-vastu tips these paintings will bring money and luck ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: ఈ పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే ధన లాభం, అదృష్టం కలగొచ్చు

Vastu Tips: ఈ పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే ధన లాభం, అదృష్టం కలగొచ్చు

Peddinti Sravya HT Telugu
Dec 09, 2024 05:30 PM IST

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ పెయింటింగ్ లేదా ఆర్ట్ వర్క్స్ ని ఉంచడం వలన మంచి జరుగుతుంది. ధన లాభంతో పాటుగా, అదృష్టం కలిసి రావడం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, సామర్థ్యం పెరగడం ఇలా పలు ప్రయోజనాలని పొందవచ్చు.

ఈ పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే ధన లాభం, అదృష్టం కలగొచ్చు
ఈ పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే ధన లాభం, అదృష్టం కలగొచ్చు

వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వలన సమస్యల నుంచి గట్టెక్కొచ్చు. సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ పెయింటింగ్ లేదా ఆర్ట్ వర్క్స్ ని ఉంచడం వలన మంచి జరుగుతుంది. ధన లాభంతో పాటుగా, అదృష్టం కలిసి రావడం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, సామర్థ్యం పెరగడం ఇలా పలు ప్రయోజనాలని పొందవచ్చు. మరి ఇంట్లో ఎలాంటి పెయింటింగ్స్ లేదా ఆర్ట్ వర్క్స్ ఉంచుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

yearly horoscope entry point

ఇంట్లో వీటిని ఉంచితే చాలా మార్పు వస్తుంది:

ఏడు గుర్రాల పెయింటింగ్

ఏడు గుర్రాల పెయింటింగ్ ఇంట్లో పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. చాలా మంది ఏడు గుర్రాల పెయింటింగ్స్ ఇంట్లో పెడుతూ ఉంటారు. దీనిని మనం తూర్పు లేదా దక్షిణం వైపు గోడకి పెట్టొచ్చు. శక్తి పెరగడంతో పాటుగా విజయాన్ని అందుకోవచ్చు. గుర్రం వేగానికి చిహ్నం. అలాగే సక్సెస్ కి సంకేతం.

బుద్ధుడు పెయింటింగ్

బుద్ధుడు పెయింటింగ్ ఇంట్లో పెట్టడం వలన ప్రశాంతత ఉంటుంది. అలాగే ఆనందంగా ఉండొచ్చు. ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి పెరుగుతుంది. లివింగ్ రూమ్ లో లేదా ధ్యానం చేసే గదిలో మనం దీనిని పెట్టొచ్చు.

జలపాతాలు

అందమైన జలపాతాలతో కూడిన పెయింటింగ్ ఇంట్లో పెట్టడం వలన మంచి జరుగుతుంది. సానుకూల శక్తి ఇంట్లో ప్రవహిస్తుంది. దీనిని ఉత్తరం లేదా ఈశాన్యం వైపు గోడకి పెట్టొచ్చు. దీనిని ఉంచడం వలన డబ్బు ప్రవాహం ఇంట్లో ఉంటుంది. సంతోషంగా ఉండొచ్చు.

నెమలి పెయింటింగ్

ఇంట్లో నెమలి పెయింటింగ్ పెట్టడం వలన ఇంటి అందం రెట్టింపు అవుతుంది. పైగా అందమైన నెమళ్ళను ఇంట్లో పెట్టడం వలన సానుకూల శక్తి పెరిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మనం ఉత్తరం లేదా ఈశాన్యం వైపు దీన్ని పెట్టుకోవచ్చు.

వినాయకుడి పెయింటింగ్

అందమైన వినాయకుడి పెయింటింగ్ ఇంట్లో పెట్టడం వలన మంచి జరుగుతుంది. విఘ్నాలకి అధిపతి అయిన వినాయకుడిని ఇంటి ముఖ ద్వారం దగ్గర పెట్టడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి. సానుకూల శక్తి పెరుగుతుంది. ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు. ఆఫీసులో కూడా మీరు వినాయకుడి ఫోటోని లేదా పెయింటింగ్ ని పెట్టొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం