Vastu: వాస్తు ప్రకారం ఇంట్లో వాషింగ్ మిషన్ ఏ దిశలో ఉండాలి? పొరపాటున కూడా ఈ దిశలో పెట్టకండి..-vastu tips keep washing machine in this direction for positive energy and never keep in this direction for good results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu: వాస్తు ప్రకారం ఇంట్లో వాషింగ్ మిషన్ ఏ దిశలో ఉండాలి? పొరపాటున కూడా ఈ దిశలో పెట్టకండి..

Vastu: వాస్తు ప్రకారం ఇంట్లో వాషింగ్ మిషన్ ఏ దిశలో ఉండాలి? పొరపాటున కూడా ఈ దిశలో పెట్టకండి..

Peddinti Sravya HT Telugu
Jan 31, 2025 07:00 AM IST

Vastu: వాస్తు ప్రకారం మనం వాషింగ్ మిషన్ ని కూడా పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వాషింగ్ మిషన్ పెట్టేటప్పుడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ ఉంటోంది.

Vastu: వాస్తు ప్రకారం ఇంట్లో వాషింగ్ మిషన్ ఏ దిశలో ఉండాలి?
Vastu: వాస్తు ప్రకారం ఇంట్లో వాషింగ్ మిషన్ ఏ దిశలో ఉండాలి? (pinterest)

చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. మన ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా సరే వాస్తు ప్రకారం అనుసరించి, తొలగించడానికి అద్భుతంగా పని చేస్తుంది. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లను పెట్టుకోవడం వలన అనేక మార్పులు ఉంటాయి.

yearly horoscope entry point

వాస్తు ప్రకారం మనం వాషింగ్ మిషన్ ని కూడా పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వాషింగ్ మిషన్ పెట్టేటప్పుడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ ఉంటోంది.

వాషింగ్ మిషన్ ని ఏ దిశలో పెట్టాలి అనేది తెలుసుకుని దాని ప్రకారం ఫాలో అవ్వడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కచ్చు.

వాస్తు ప్రకారం వాషింగ్ మిషన్ ని పెడితే ఏమవుతుంది?

  1. ఇంట్లో వాషింగ్ మిషన్ ని పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాస్తు ప్రకారం పెట్టడం మంచిది.
  2. దాని వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
  3. వాస్తు ప్రకారం వాషింగ్ మిషన్ పెడితే, ఇబ్బందులన్నీ తొలగిపోవచ్చు.

ఏ దిశలో పెట్టాలి?

వాషింగ్ మిషన్ ని ఇంట్లో పెట్టేటప్పుడు ఆగ్నేయం వైపు పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఆగ్నేయం వైపు వాషింగ్ మిషన్ ఉంటే వాస్తు దోషాలు తొలగిపోవచ్చు. ఆగ్నేయం వైపు కుదరకపోతే వాయువ్యం వైపు పెట్టొచ్చు. ఇది కూడా సానుకూల శక్తిని ప్రవహించేలా చేస్తుంది.

మీ బాత్రూం లో ఎక్కువ ప్లేస్ ఉన్నట్లయితే బాత్ రూమ్ లో ఈ దిశలో మీరు వాషింగ్ మిషన్ ఉండేటట్టు చూసుకోవచ్చు. అయితే, వాషింగ్ మిషన్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం వైపు మాత్రం పెట్టొద్దు.

ఈశాన్యం వైపు పెట్టినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి. నైరుతి వైపు కూడా వాషింగ్ మిషన్ పెట్టడం మంచిది కాదు. వాస్తు ప్రకారం ఏ వస్తువు ఏ దిశలో ఉంటే మంచిది అనేది చెప్పబడింది. అలా అనుసరించడం వలన సానుకూల శక్తి కలిగి సంతోషంగా ఉండొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం