Vastu: ఇంట్లో ఈ ప్రదేశాల్లో లవంగాలను పెడితే సంపద పెరుగుతుంది.. డబ్బుకు లోటు ఉండదు.. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది-vastu tips keep cloves at home to receive positive energy and even health issues will be solved and wealth will increase ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu: ఇంట్లో ఈ ప్రదేశాల్లో లవంగాలను పెడితే సంపద పెరుగుతుంది.. డబ్బుకు లోటు ఉండదు.. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది

Vastu: ఇంట్లో ఈ ప్రదేశాల్లో లవంగాలను పెడితే సంపద పెరుగుతుంది.. డబ్బుకు లోటు ఉండదు.. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది

Peddinti Sravya HT Telugu
Dec 28, 2024 05:00 PM IST

Vastu: వాస్తు ప్రకారం లవంగాలను ఇలా ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. సంతోషంగా జీవించొచ్చు. అయితే, లవంగాలను ఇంట్లో ఏ ప్రదేశంలో పెట్టాలి?, ఎలా సానుకూల శక్తిని పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Vastu: ఇంట్లో ఈ ప్రదేశాల్లో లవంగాలను పెడితే సంపద పెరుగుతుంది
Vastu: ఇంట్లో ఈ ప్రదేశాల్లో లవంగాలను పెడితే సంపద పెరుగుతుంది (pinterest)

చాలా మంది వాస్తుని నమ్ముతారు. వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం మనం నడుచుకోవడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ధనం కూడా కలుగుతుంది. ప్రశాంతంగా ఉండవచ్చు. ఆనందంగా ఉండడానికి కూడా వాస్తు మనకు ఎంతగానో సహాయం చేస్తుంది.

yearly horoscope entry point

చాలా మంది అందుకనే వాస్తు చిట్కాలని పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం లవంగాలను ఇలా ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. సంతోషంగా జీవించొచ్చు. అయితే, లవంగాలను ఇంట్లో ఏ ప్రదేశంలో పెట్టాలి?, ఎలా సానుకూల శక్తిని పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలా ఇంట్లో లవంగాలని పెట్టినట్లయితే చాలా లాభాలు ఉంటాయి

ఇంట్లో లవంగాలని కింది చెప్పినట్టు పెట్టినట్లయితే చాలా మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఎంతో సంతోషకరమైన జీవితాన్ని

1. దిండు కింద

లవంగాలను దిండు కింద పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. సంతోషంగా ఉండవచ్చు. ధనం కూడా కలుగుతుంది. ధన నష్టం వంటి ఇబ్బందులు ఉండవు. సంతోషంగా జీవించొచ్చు.

2.పర్సులో పెట్టండి

లవంగాలను ఇంట్లో పెట్టడంతో పాటు పర్సులో కూడా పెట్టుకోవచ్చు. పర్సులో డబ్బులు పెట్టుకుంటూ ఉంటాము. పర్సులో లవంగాలను పెట్టడం వలన లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది. ధనాకర్షణ కలిగి సంతోషంగా ఉండవచ్చు. డబ్బుకి లోటు ఉండదు.

3.లవంగాల దీపం

శుక్రవారం నాడు లవంగాల దీపాన్ని పెడితే మంచి జరుగుతుంది. పూజ గదిలో కానీ ఇంటి ముఖద్వారం దగ్గర కానీ ఐదు లవంగాలని ఉపయోగించి, దీపారాధన చేయండి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆర్థిక బాధలు కూడా ఉండవు.

4.లక్ష్మీదేవికి లవంగాలను సమర్పించండి

ప్రతి రోజు పూజ చేసేటప్పుడు ముఖ్యంగా శుక్రవారం నాడు లవంగాలను, గులాబీ పూలను లక్ష్మీదేవికి సమర్పించండి. ఇలా చేయడం వలన సిరి సంపదలు కలుగుతాయి. జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు. సంపద కూడా పెరుగుతుంది.

5.ఎర్రటి క్లాత్లో పెట్టండి

ఎర్రటి క్లాత్లో ఐదు లవంగాలను చుట్టి, బీరువాలో పెడితే మంచి జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. బీరువాలో పెట్టినట్లయితే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం