వాస్తు ప్రకారం పాటించడం వలన చాలా ఇబ్బందుల నుంచి సులువుగా గట్టెక్కచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం పాటిస్తే ఇంట్లో ఆనందం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. వాస్తు దోషాలు తొలగిపోవడానికి కూడా కొన్ని వాస్తు పరిహారాలు ఉన్నాయి.
వాస్తు దోషాల వలన హఠాత్తుగా ఆనందం, ప్రశాంతత తొలగిపోవడం, ఆర్థిక ఇబ్బందులు రావడం, డబ్బు వృధాగా ఖర్చు అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే, కర్పూరంతో వాస్తు సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. వాస్తు దోషాల నుంచి బయటపడి సంతోషంగా ఉండొచ్చు.
రోజూ కర్పూరాన్ని ఇంట్లో వెలిగించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇంట్లో సంతోషం కూడా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక గిన్నెలో కర్పూరాన్ని వేసి ఇంట్లో అక్కడక్కడ పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ధన ప్రవాహం ఉంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో కర్పూరాన్ని పెడితే మంచి జరుగుతుంది. సానుకూల శక్తి వ్యాపించి, సంతోషంగా ఉండొచ్చు. ప్రతికూల ప్రభావం పడుతుంది.
భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలగకుండా ఉండడానికి, పడకగదిలో ఒక చిన్న గిన్నెలో కర్పూరాన్ని ఉంచండి. ఇలా చేయడం వలన హాయిగా నిద్రపోవచ్చు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
ముఖద్వారం దగ్గర కర్పూరం పెడితే సానుకూల శక్తి వస్తుంది. వాస్తు దోషాలు తొలగిపోతాయి. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండవచ్చు.
కర్పూరాన్ని లాకర్లో పెడితే కూడా సానుకూల శక్తి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు. ఎక్కువ డబ్బులుని సంపాదించడానికి వీలు ఉంటుంది.
వంటగదిలో కర్పూరాన్ని పెడితే కీటకాలు వంటివి చేరవు. ఆహారానికి, డబ్బుకి కొరత ఉండదు. సంతోషంగా ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం