Vastu Tips for Wealth: ఈ 9 ఇంట్లో ఉంటే పట్టిందల్లా బంగారమే.. సమస్యలన్నీ తీరినట్టే
Vastu Tips for Wealth: ప్రతీ ఒక్కరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అయితే, వీటిని కనుక ఇంటికి తీసుకు వచ్చినట్లయితే పట్టిందల్లా బంగారమే. సమస్యలన్నీ తీరినట్టే. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసేయండి.
వాస్తు శాస్త్రం ప్రకారం పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లను ఉంచడం వలన ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. ఏ ఇబ్బందులు లేకుండా సులువుగా బయటపడవచ్చు. వాస్తు ప్రకారం, ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన పట్టిందల్లా బంగారమే. మీకు తిరుగే ఉండదు. అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది.
వాస్తు ప్రకారం వీటిని ఇంట్లో పెట్టుకుంటే పట్టిందల్లా బంగారమే
ప్రతీ ఒక్కరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అయితే, వీటిని కనుక ఇంటికి తీసుకు వచ్చినట్లయితే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ ఇంట ఉంటుంది.
1.నెమలీకలు
ఇంట్లో నెమలీకలని ఉంచితే సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. రోజూ భగవంతుని ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసరాలి. ఇలా చేయడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి.
2.లాఫింగ్ బుద్ధ
ఇంట్లో ఈశాన్యం వైపు లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఉండడం వలన జీవితంలో ఎంతో అభివృద్ధి కలుగుతుంది.
3.తాబేలు
ఇంట్లో చిన్న తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే కూడా డబ్బుకి కొరత ఉండదు. ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడచ్చు. సంతోషంగా ఉండడానికి అవుతుంది.
4.లక్ష్మీదేవి
ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఈశాన్యంలో పెడితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు.
5.గవ్వలు
గవ్వలని దేవుడి దగ్గరే కాదు డబ్బులు నిలువ చేసే చోట కూడా పెట్టొచ్చు. వ్యాపారులు వారు క్యాష్ కౌంటర్ లో పెట్టుకుంటే కూడా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది.
6.పచ్చ కర్పూరం
విష్ణుమూర్తికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చి, నైవేద్యం పెడితే సమస్యలన్నీ తీరిపోతాయి.
7.తులసి మొక్క
తులసి మొక్క సంపదని అందిస్తుంది. ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఒక మొక్కను తెచ్చి ఇంట్లో నాటండి. తులసి మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. డబ్బుకి లోటు ఉండదు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
8.ఏనుగు విగ్రహం
లోహపు ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే చాలా మంచి జరుగుతుంది. ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండొచ్చు.
9.మామిడాకుల తోరణం
ఇంటి ముఖ ద్వారం వద్ద మామిడి ఆకుల తోరణాన్ని కడితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దీంతో పాటుగా ప్రధాన ద్వారం దగ్గర కుడివైపు నీటితో నిండిన కలశాన్ని పెట్టండి. ఇది కూడా శ్రేయస్సు తీసుకువస్తుంది.
లక్ష్మీదేవికి ఇలా హారతి ఇవ్వండి
శుక్రవారం పూట పూజ గదిలో యాలకులు, కర్పూరాన్ని కాల్చి.. ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఆ తర్వాత మీ కోరికను కోరుకోండి. ఇలా చేయడం వలన మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం