Vastu Tips For Students: మీ పిల్లలకు చదువుపై ఆసక్తి లేదా? ఈ 4 వాస్తు చిట్కాలతో ఏకాగ్రత పెరిగి, మంచి మార్కులు వస్తాయి
Vastu Tips For Students: వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. ఇలా చేయడం వలన పిల్లలు చదువుకోడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ 4 వాస్తు చిట్కాలతో ఏకాగ్రత పెరిగి, మంచి మార్కులు వస్తాయి.
ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు బాగా చదువుకోవాలని, వృద్ధిలోకి రావాలని అనుకుంటారు. చాలా మంది పిల్లలు చదువుకోడానికి ఆసక్తి చూపించరు. మీ పిల్లలు కూడా చదవడానికి ఆసక్తి చూపించడం లేదా? అయితే ఇలా చేయండి. వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు.
పిల్లలు బాగా చదువుకోవాలంటే ఇలా చేయండి
1.సరైన రంగులు
సైకాలజీ ప్రకారం పిల్లల స్టడీ రూమ్ మంచి రంగులతో ఉండాలి. అప్పుడే పిల్లలు చదువుకోడానికి ఆసక్తి చూపిస్తారు. లేత ఆకుపచ్చ, లేత బ్రౌన్ కలర్ పిల్లలు గదిలో పెయింట్ చేయడం వలన పిల్లలు చదువులో ఆసక్తి పెడతారు. ఆదర్శంగా ఉండే పెయింటింగ్లు లేదా పోస్టర్లు వంటివి పెడితే కూడా పిల్లలు చదువులో రాణిస్తారు.
2.ఈ దేవుడి ఫోటోలు
మీ ఇంట్లో వినాయకుడి ఫోటో లేదా విష్ణుమూర్తి కానీ కార్తికేయుడు ఫోటోని కానీ పెట్టడం మంచిది. ఇలా చేస్తే కూడా పిల్లలు బాగా చదువుతారు. చదువుపై ఆసక్తి వస్తుంది.
3.సరస్వతి యంత్రం
పిల్లల గదిలో సరస్వతీ దేవి యంత్రాన్ని స్వయంగా మీరే పెట్టాలి. ఇది సానుకూల శక్తిని తీసుకువస్తుంది. మీ పిల్లలకి చదువుకోవాలని అనిపించకపోతే, సోమవారం కానీ ఆదివారం కానీ సరస్వతి దేవి యంత్రాన్ని ఇంట్లో పెట్టండి. అలాగే ఒక తెల్లని కాగితం తీసుకుని పసుపుతో దానిపై స్వస్తిక్ గుర్తు వేయండి. ఆదివారం నాడు ఇలా చేయడం వలన పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
4.తులసి ఆకులు
పిల్లలు రోజూ తులసి ఆకుల్ని నమిలితే మెదడు షార్ప్ గా పని చేస్తుంది. సోమవారం, ఆదివారం నాడు తులసి ఆకులను పిల్లలు తింటే ఆరోగ్యం బాగుంటుంది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం