చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి కలుగుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. నిద్రపోవడానికి కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. వీటిని పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండొచ్చు. పైగా వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఆరోగ్యం, శాంతి, విజయం దక్కుతాయి.
వాస్తు ప్రకారం నిద్రపోవడం వలన అనేక లాభాలని పొందడానికి అవుతుంది. మానవ శరీరానికి సొంత అయస్కాంత శక్తి ఉంది. తప్పు దిశలో నిద్రపోవడం వలన ఈ శక్తిలో ఆటంకాలు కలుగుతాయి. ఒత్తిడి, అలసట, అనారోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి. వాస్తు ప్రకారం నిద్రపోవడానికి ఏ దిశ సరైనది?
వాస్తు ప్రకారం దక్షిణం వైపు తల పెట్టుకుని నిద్రపోవడం అత్యంత ప్రయోజనకరంగా పరిగణించబడింది. ఈ దిశ శరీరాన్ని భూమి యొక్క అయస్కాంత క్షేత్రంతో సమలేఖనం చేస్తుంది. నిద్రని మెరుగుపరుస్తుంది. నిద్ర నాణ్యతని కూడా మెరుగుపరుస్తుంది. శ్రేయస్సుని అందిస్తుంది.
తూర్పు దిశ లో నిద్రపోయినప్పుడు మానసిక స్పష్టత, ఏకాగ్రత, విజయాన్ని పొందవచ్చు. సూర్యుడు ఉదయించే ఈ దిశ పెరుగుదలని సూచిస్తుంది. విద్యార్థులకు, నిపుణులకు అనుకూలంగా ఉంటుంది.
పడమర వైపు తల పెట్టుకుని నిద్రపోవడం వలన మధ్యస్థ ఫలితం ఉంటుంది. తూర్పు, దక్షిణం వైపు నిద్రపోయేనప్పుడు కలిగే ప్రయోజనాలు ఈ దిశలో నిద్ర పోయినప్పుడు కలగవు. ఇది మితమైన విజయాన్ని, స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోవడం నిషేధించబడింది. ఈ వైపు నిద్రపోవడం వలన ఒత్తిడికి దారి తీస్తుంది. సరిగా నిద్ర పట్టదు. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకు ఇది మంచిది కాదు. ముందు ఉన్న అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది.
మాస్టర్ బెడ్ రూమ్ ఇంటి నైరుతి వైపు ఉంటే మంచిది. పడకగదిని ఈశాన్య దిశలో ఉంచడం మానుకోవాలి. ఇది అశాంతికి దారితీస్తుంది.
మంచాన్ని ప్రధాన తలుపుకి ఎదురుగా ఉంచొద్దు. దీని వలన నష్టాలు వస్తాయి. మీరు నిద్రపోయే గదిలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. నిద్రపోయే గది ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి.
మంచానికి ఎదురుగా అద్దం ఉంచడం మంచిది కాదు. ఇది సానుకూల శక్తిని దూరం చేస్తుంది. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. శుభ ఫలితాలను పొందవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం