Vastu tips: ఇంట్లో చిలుకను పెంచుకుంటున్నారా? ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి
Vastu tips: మీరు ఇంట్లో చిలుకను పెంచుకుంటున్నారా? అయితే దానికి సంబంధించిన వాస్తు నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. దాని ప్రకారం చిలుకను ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుంది.
Vastu tips: చాలామందికి పెంపుడు జంతువులు పెంచుకోవడం చాలా ఇష్టం. కుక్క, పిల్లలు, చేపలు, కుందేలు, చిలుకలతో సహా అనేక జంతువులను, పక్షులను పెంచుకోవడానికి ఇష్టపడతారు.
పెంపుడు జంతువులను ఉంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతారు. అయితే ఎక్కువమంది చిలకలు పెంచుకోవడానికి అత్యంత ఉత్సాహం చూపిస్తారు. కొన్ని మాట్లాడే చిలుకలతో ఇష్టంగా కాలక్షేపం చేస్తారు. వాటితో మాట్లాడుతూ సరదాగా ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చిలుక ఇష్టం. కానీ ఇంట్లో చిలకను పెంచుకోవడం శుభమేనా అనే అనుమానం ప్రజల్లో తరచూ ఉంటుంది. వాస్తు ప్రకారం చిలుకను పెంచుకోవడానికి సంబంధించి అనేక నియమాలను ఉన్నాయి.
వాస్తు నియమాల ప్రకారం చిలుకను ఇంట్లో పెంచుకోవడం వల్ల సంతోషం, అదృష్టం పెరుగుతాయని నమ్ముతారు. ఇంట్లో చిలుకను పెంచుకోవడానికి ఉన్న నియమాలు ఏంటి? ఎటువంటి పరిస్థితుల్లో చిలుక వల్ల ప్రతికూల శక్తి వస్తుందో వంటి వివరాలు తెలుసుకుందాం.
చిలకను పెంచడం శుభమా? లేక అశుభమా?
వాస్తు ప్రకారం చిలుకను ఇంటికి ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశలు కుబేరుడు, లక్ష్మీదేవికి సంబంధించినవి. అందుకే ఈ దిశలు మంచివిగా చెప్తారు.
చిలుకను బోనులో ఉంచినట్టయితే అది సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. చిలుక బోనులో సంతోషంగా లేనప్పుడు నెగెటివిటీ పెరుగుతుందని నమ్ముతారు.
అంతేకాదు ఇంట్లో చిలుక బొమ్మ పెట్టడం కూడా ఎంతో శుభప్రదం. ఇది జాతకంలోని గ్రహ దోషాలు నుండి విముక్తిని ఇస్తుంది.
చిలకను ఇంట్లోకి తీసుకురావడం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలా చేసినప్పుడే ఇది శుభ ఫలితాలు ఇస్తాయి. జీవితంలో సంతోషం కలుగుతుంది
చిలుకను ఏ పరిస్థితుల్లో పెంచుకోవచ్చు
చిలుకను ఇంట్లో ఉంచడం వల్ల రాహువు, కేతువు, శని దుష్ప్రభావాలు తగ్గించవచ్చు అని నమ్ముతారు. జ్యోతిష్య ప్రకారం చిలుకను ఇంట్లో ఉంచుకోవడం వల్ల రోగాలు కూడా తొలగిపోతాయి. పిల్లలకి చదువుకోవాలనే భావన కూడా కలుగుతుంది. ఇంట్లో చిలుకను ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం మెరుగుపడుతుంది.
ఇంట్లో చిలకను పెంచుకోవాలని అనుకుంటున్నాట్లతే మీరు ఒంటరిగా ఉన్న చిలుక ఉంచకూడదు. జంట చిలుకలను ఎప్పుడూ ఉంచాలి. అప్పుడే దంపతుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి.
చిలుకను ఇంట్లో పెంచుకుంటే అకాల మరణం సంభవించే ప్రమాదాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వీటిని ఇంట్లో ఉపయోగించుకుంటే పిల్లలకు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని విశ్వసిస్తారు.
ఈ పరిస్థితుల్లో చిలుకను పెంచుకోవద్దు
చిలుక సంతోషంగా లేకపోతే ఇంట్లో తరచూ అశుభ పరిణామాలు ఎదురవుతాయి. గృహోపకరణాలు చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇంటి సభ్యులు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంట్లో గొడవ జరిగి ఆ విషయాలను చిలుక పునరావృతం చేస్తూ పలుకుతుంటే జ్యోతిష్య శాస్త్రపరంగా దీన్ని అశుభసంకేతంగా పరిగణిస్తారు. అలాగే జాతకంలో చిలుకను పెంచుకునే యోగం లేకపోయినా మీరు దాన్ని పెంచుకుంటే అది నష్టాలకు దారి తీసే అవకాశం ఉంది.
టాపిక్