Vastu Tips: తలుపులకే కాదు, తాళాలకూ, తాళం చెవికి కూడా వాస్తు నియమాలు ఉంటాయి- పాటించకపోతే ఏం జరుగుతుందో తెలుసా?-vastu tips for house keys car keys and bike keys in home ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: తలుపులకే కాదు, తాళాలకూ, తాళం చెవికి కూడా వాస్తు నియమాలు ఉంటాయి- పాటించకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Vastu Tips: తలుపులకే కాదు, తాళాలకూ, తాళం చెవికి కూడా వాస్తు నియమాలు ఉంటాయి- పాటించకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Ramya Sri Marka HT Telugu
Nov 23, 2024 11:09 AM IST

Vastu Tips:ఇంటికి, ఇంట్లోని వస్తువులకు మాత్రమే వాస్తు నియమాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. ఇంటికి, వాహనాలకు, ఇంట్లోని బీరువాలు, కబోర్డులు వంటి ముఖ్యమైన వస్తువులను కాపాడే తాళం చెవులకు కూడా వాస్తు నియమాలు ఉంటాయి.

తాళం చెవులకు వాస్తు నియమాలు
తాళం చెవులకు వాస్తు నియమాలు

ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం ఉండాలి. ఇంట్లోని గదులు వాటికి ఉండే తలుపులు కూడా వాస్తు సూచనల ప్రకారమే ఉండాలి. ఇవన్నీ చాలా మందికి తెలిసిన విషయాలే. అయితే గదులకూ, తలుపులకూ మాత్రమే కాదు వాస్తు నియమాలు తాళాలకూ, తాళం చెవులకూ కూడా ఉంటాయట. కాస్త అతిశయోక్తిగా అనిపించినా ఇది ముమ్మాటికి వాస్తవమేనని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లోని చాలా వస్తువుల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మనం లేకున్నా వాటన్నింటినీ కాపాడే తాళం చెవులకు మాత్రం వాస్తు ప్రకారం ఎందుకు ఉండకూడదు అని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంటికి, కారుకూ, బీర్వాలు, కబోర్డులు వంటి ముఖ్యమైన వస్తువులకు కాపలాగా ఉండే తాళం చెవులను ఎక్కడ పడితే అక్కడ పడేయటం ఎంత వరకూ సరైదని వారి వాదన.

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటికి, ఇంట్లోని వస్తువులన్నింటికీ, కారు, బైకు వంటి వాహనాలకు కాపలాగా ఉండే తాళం చెవులను వాస్తు ప్రకారం ఉంచకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాళం చెవులను వాస్తు నియమం ప్రకారం ఉంచితే ఇంటికి చాలా శుభం కలుగుతుందట. తాళం చెవులకున్న వాస్తు నియమాలేంటో దాన్ని ఎక్కడ పెడితే మంచిదో.. ఎక్కడ పెట్టకూడదో తెలుసుకుందాం..

తాళం చెవులకు ఎక్కడ ఉంచకూడదు..?

1. ఇంట్లోని అన్ని మూలల్లో ఈశాన్య మూల చాల ముఖ్యమైనది. ఈ దిశలో లోహపు వస్తువులను ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. కనుక ఇంటి తాళం చెవిని పొరపాటున కూడా ఈశాన్య మూలలో ఉంచకండి. ఈ మూలలో తాళం చెవులను ఉంచడం వల్ల ఇది ప్రతికూల శక్తులను ఆకర్షించే ప్రమాదముంది. ఇది అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది.

2. చాలా మంది తాళం చెవులను పూజ గదుల్లో ఉంచుతుంటారు. పూజ గది చాలా పవిత్రమైనది. ఇక్కడ తాళం చెవులను ఉంచడం శుభప్రదమని భావిస్తారు. నిజానికి తాళం చెవులకు పూజగదిలో ఉంచడం మంచిది కాదట. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. కనుక పూజ గదిలో తాళం చెవులను ఉంచకండి.

3. చాలా మంది వంటగదిలో తాళం చెవులకు ఉంచుతారు. వాస్తవానికి ఇంట్లో వంటగదికి ప్రాముఖ్యత ఎక్కువ.అగ్నికి, ఆహారానికి మూలం వంటగది. అలాంటి వంటగది ఎప్పుడూ శుభ్రంగా, వాస్తుకు అనుగుణంగా ఉంటేనే ఇంట్లోని వారంతా ఆరోగ్యంగా ఉంటారు. వంట గదిలో తాళం చెవులను ఉంచడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక తాళం చెవులను కిచెన్లో ఎప్పుడూ ఉంచకూడదు.

4. టీవీ దగ్గర, పిల్లలు రాసుకునే టేబుల్ మీద, వర్క్ చేసుకునే బల్లాల మీద తాళం చెవులకు పడేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆయా స్థానాల్లో ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశముంది. కనుక తాళం చెవుల కంటూ ఒక వస్తువును ఏర్పాటు చేసుకోవాలి. మార్కెట్లో తాళం చెవుల కోసం చాలా రకాల చెక్క వస్తువులు లభిస్తున్నాయి.

తాళం చెవులు ఎక్కడ ఉంచితే శుభప్రదం..?

1. తాళం చెవులు అనేవి ఇంటిని, ఇంట్లోని వస్తువులను కాపలా కాసే వస్తువు. కనుక దీనికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. వాస్తు నియమంలో ఇంట్లో నైరుతి దిశకు ప్రాధాన్యత ఎక్కువ. కనుక నైరుతి దిశలో తాళం చెవులను ఉంచాలి. ఇలా చేయడం ఇంటికి శుభప్రదం. అంతేకాదు ఇంటికి నైరుతి దిశలో తాళం చెవులను ఉంచడం వల్ల ఇళ్లు సిరి సంపదలతో తులతూగుతుందట.

2. ఇంట్లోని ఉత్తరం లేదా తూర్పు దిశలో కీ షెల్ఫ్ ఉంచడం కూడా ఇంటికి మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్థిక వృద్ధి బాగుటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

3. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇంట్లో పనికి రాని తాళం చెవులు, తుప్పు పట్టిన తాళం చెవులను ఇంట్లో అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner