Vastu Tips for Career Growth: జాబ్ ప్రమోషన్ కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి
Vastu Tips for Career Growth:కెరీర్‌లో ఎదగాలంటే కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి కదా. కాలం కలిసొచ్చి అదృష్టం రావాలంటే మనకు కచ్చితంగా పాటించాల్సిన వాటిల్లో ఒకటి వాస్తు శాస్త్రం.
మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ అవాలనీ పేరు, డబ్బు రెండూ దక్కాలనీ అంతా ఆశ పడుతుంటారు. అయితే కెరీర్లో ఎదగాలంటే కేవలం కష్టపడితే సరిపోతుంది అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. వృత్తిపరంగా సక్సెస్ సాధించాలంటే చాలా అంశాలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఎదగాలంటే కేవలం కష్టపడటం మాత్రమే కాదు కాస్త లక్ కూడా ఉండాలి. ముఖ్యంగా పని చేసే చోట సానుకూల పరిస్థితులను ఏర్పరుచుకోవడం చాలా అవసరం. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని, కెరీర్లో సులభంగా ఎదుగుతారని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ శాస్త్రం కేవలం ఇళ్ల నిర్మాణాలకు, డిజైన్ల కోసం మాత్రమే కాదు. ఇంట్లో సుఖసంతోషాలకు, లక్ష్మీ కటాక్షం పొందడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు కెరీర్ పరంగా ఎదిగేందుకు కూడా వాస్తు నియమాలు బాగా దోహదపడతాయి. పని చేసే చోట కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిట్కాలు పాటించడం వల్ల కెరీర్లో ఎదగడం ఖాయమని, జాబ్ లో ప్రమోషన్ పక్కా అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..
ప్రోత్సాహకరమైన పని వాతావరణాన్ని సృష్టించుకోవడం
మీ చుట్టూ ఉండే వాతావరణం ప్రభావం మీరు చేసే పని మీద ఖచ్చితంగా ఉంటుంది. కనుక పనిచేసే చోట సానుకూల వాతావరణం ఏర్పరుచుకోవడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు పనిచేసే చోటు తూర్పు లేదా ఉత్తరాన ఉండేలా చూసుకొండి. ఈ దిశకు అభిముఖంగా కూర్చుని పనిచేయడం వల్ల పనిచేసే చోటంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అంతేకాదు.. మీలోని క్రియేటివిటీని పెంచుంది. శాంతి వాతావరణం నెలకొల్పి పనిమీద దృష్టిని మెరుగుపరుస్తుంది.
వస్తువుల వినియోగం
వాస్తు శాస్త్రం కెరీర్, సక్సెస్‌లో భాగమనే విషయం గుర్తించి ఉత్తర దిశకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రత్యేక వస్తువులైన డెస్క్, ఫైల్స్, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఈ దిశలో ఉంచడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఇలా చేయడం వల్ల శాంతియుతంగా పనిచేయగలుగుతారు. ఎటువంటి గందరగోళం లేకుండా సజావుగా పనిచేసుకోగలిగిన వారు ఉన్నత స్థానాలను పొందొచ్చు.
రంగులలో ప్రాముఖ్యత
మనం వేసుకునే దుస్తులు లేదా వాడే వస్తువుల రంగులు మన మూడ్‌ను, మన చుట్టూ ఉండే శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రంగులు సక్సెస్, అభివృద్ధితో ముడిపడి ఉంటాయి. ఇంట్లో అయినా.. ఆఫీసుల్లో అయినా పనిచేసే చోట ఆకుపచ్చ రంగు, నీలం రంగులు ఉండేలా చూసుకోండి. అవి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి భవిష్యత్తులో ముందుకు వెళ్లేందుకు సహకరిస్తాయి.
పర్సనల్ గ్రోత్ కోసం రంగురాళ్లు(క్రిస్టల్స్)
మనిషిలోని శక్తిని పెంచే లక్షణాలు రంగురాళ్లు(క్రిస్టల్స్) చాలా ఉన్నాయని ఏళ్ల తరబడి విశ్వసిస్తున్నారు. సైట్రిన్ లేదా క్లియర్ క్వార్ట్జ్ వంటి క్రిస్టల్స్‌ను మీ డెస్క్ కు ఆగ్నేయ దిశలో ఉంచుకోండి. ఇవి మీరు పనిచేసే చోట సానుకూల ప్రభావాన్ని పెంచి వృత్తిలో ఎదుగుదలకు దోహదపడుతాయి. ప్రమోషన్ కోసం ఎదురుచూసే వారికి ఇవి చాలా బాగా సహాయపడతాయి.
మూలకాల సమతుల్యత
నేల, నీరు, అగ్ని, గాలి, ఖాళీ ప్రదేశం అనే ఐదు మూలకాలు వాస్తు శాస్త్రంలో చాలా కీలకం. వీటిని మీరు పనిచేసుకునే ప్రదేశంలో కచ్చితంగా ఉండేలా చూసుకోండి. నేలను సూచించడానికి ఇన్‌డోర్ ప్లాంట్స్, నీటిని సూచించడానికి చిన్న ఫౌంటైన్, అగ్ని కోసం క్యాండిల్స్, గాలి కోసం వెంటిలేటెడ్ వాతావరణం, ఖాళీ ప్రదేశం కోసం గందరగోళం లేని పరిసరాలను సిద్ధంగా ఉంచుకోండి.
ఈ జాగ్రత్తలు పాటించి వాస్తు శాస్త్రం సహాయంతో మీ కెరీర్‌ను వృద్ధి పరుచుకోండి.
టాపిక్