వాస్తు ప్రకారం పాటించడం వలన అనేక సమస్యల నుంచి సులువుగా బయటపడడానికి అవుతుంది. వాస్తు ప్రకారం అనుసరిస్తే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో ప్రశాంతత, సంతోషం ఉంటాయి. ప్రతీ విషయంలో కూడా మనం వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటాము. ఏది ఎక్కడ పెడితే మంచి జరుగుతుంది అనేది తెలుసుకుని దాని ప్రకారం పాటిస్తూ ఉంటాము.
ఇంట్లో ఏ గది, ఏ దిశలో ఉండాలి?, ఏ గదిలో ఎలాంటి వస్తువులు ఉండాలి అవి కూడా ఏ దిశలో ఉండాలి అనేవి తెలుసుకుని, దాని ప్రకారం చాలా మంది పాటిస్తూ ఉంటారు.
ఈరోజుల్లో ప్రతీ ఒక్కరి ఇంట్లో కూడా బండి, కారు ఉంటున్నాయి. ఇంట్లో ద్విచక్ర వాహనాలను లేదా నాలుగు చక్రాల వాహనాలను ఏ దిశలో పెట్టాలి?, ఏ దిశలో ఉంచితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం కారు లేదా బండిని పార్కింగ్ లో పెట్టేటప్పుడు సరైన దిశలో పెట్టడం మంచిది. ఆఫీసులో అయినా ఇంట్లో అయినా సరే ఎక్కడైనా వాహనాలని పెట్టేటప్పుడు వీటిని పాటిస్తే సానుకూల శక్తి కలుగుతుంది. అలాగే వాహనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు రావు.
మీరు మీ వాహనాలని పెట్టేటప్పుడు నైరుతి వైపు పెట్టడం మంచిది. ఆ తర్వాత వాయువ్యం, ఈశాన్యం వైపు పార్కింగ్ చేయడం మంచిది.
కార్ గ్యారేజీ బేస్మెంట్ ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోండి. సానుకూల శక్తి ప్రవేశించాలంటే గ్యారేజీలో తగినంత గాలి, వెల్తురు ఉండేటట్టు చూసుకోవాలి. కారు తాళాలు, మాన్యువల్స్ ని వాయువ్యం వైపు పెడితే మంచిది. వాహనాలను పార్కింగ్ చేయడానికి నైరుతి, వాయువ్య దిశలు చాలా మంచివి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం