Vastu Tips: ఎట్టిపరిస్థితుల్లో ఈ 3 వస్తువులను ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దు-vastu tips do not take these 3 things from anyone ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: ఎట్టిపరిస్థితుల్లో ఈ 3 వస్తువులను ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దు

Vastu Tips: ఎట్టిపరిస్థితుల్లో ఈ 3 వస్తువులను ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దు

Peddinti Sravya HT Telugu

Vastu Tips: సాధారణంగా జీవితంలో మనం ఒకరికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. ఒకరి నుంచి మనం ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము. తెలిసిన వాళ్ళు అప్పుడప్పుడు మనకి ఏమైనా ఇస్తూ ఉంటారు. అలాగే మనం కూడా మన దగ్గర ఉన్నవి, మనకి నచ్చినవి, వారికి అవసరమైనవి ఇస్తూ ఉంటాము. కానీ, వీటిని తెచ్చుకోవడం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఎట్టిపరిస్థితుల్లో ఈ 3 వస్తువులను ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దు

ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం వాస్తు చిట్కాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కొన్ని కొన్ని సార్లు మనకి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. అలాంటి తప్పులు వలన కూడా ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది.

పొరపాటు చేయకండి:

కొన్ని కొన్ని సార్లు మనం తెలియకుండా చేసే పొరపాట్లు వలన తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది ఈ పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ, ఇలాంటి పొరపాట్లను ఎప్పుడు చేయకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం వీటిని ఎవరికీ తెలిసి కానీ తెలియక కానీ ఇవ్వకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని ఎవరికీ ఇవ్వకూడదట. కాబట్టి పొరపాటు చేసి అనవసరంగా తర్వాత ఇబ్బంది పడకండి.

కొన్ని వస్తువులు విషయంలో జాగ్రత్త:

సాధారణంగా జీవితంలో మనం ఒకరికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. ఒకరి నుంచి మనం ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము. తెలిసిన వాళ్ళు అప్పుడప్పుడు మనకి ఏమైనా ఇస్తూ ఉంటారు. అలాగే మనం కూడా మన దగ్గర ఉన్నవి, మనకి నచ్చినవి, వారికి అవసరమైనవి ఇస్తూ ఉంటాము. కానీ, వీటిని తెచ్చుకోవడం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పొరపాట్లు అసలు చేయకండి

ఎట్టిపరిస్థితుల్లో వీటిని తీసుకోవద్దు. సానుకూల శక్తి తొలగిపోయి ప్రతికూల శక్తిని ప్రవహిస్తుంది. అంతే కాక ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పేదరికం అనుభవించాల్సి ఉంటుంది. అందుకే తెలిసి కానీ తెలియక కానీ ఈ పొరపాట్లు చేయకండి.

పాత ఫర్నీచర్:

ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర నుంచి పాత ఫర్నీచర్ కొనుగోలు చేయడం మంచిది కాదు. పాత డైనింగ్ టేబుల్స్, కుర్చీలు, మంచం మొదలైనవి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పేదరికం అనుభవించాల్సి ఉంటుంది.

చెప్పులు:

కొన్ని కొన్ని సార్లు మన చెప్పులు ఇతరులకి ఇచ్చి, వాళ్ళ చెప్పులు మనం వేసుకుంటూ ఉంటాం. కానీ ఈ తప్పును ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైనా ఇతరులు చెప్పులు లేదా షూ వేసుకోవడం వలన ప్రతికూల శక్తి ఏర్పడి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గొడుగు:

ఇతరుల ఇంటి నుంచి గొడుగుని తెచ్చుకోవడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా మంది ఒకరి ఇంట్లో నుంచి గొడుగు తెచ్చుకుని తర్వాత మళ్లీ తిరిగి ఇస్తూ ఉంటారు అస్సలు అలా చేయకండి. ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకున్నట్లవుతుంది.

సంబంధిత కథనం