Sleeping Vastu Tips : మీ తల పక్కన వీటిని పెట్టుకుని పడుకోకండి.. మీకే నష్టం!-vastu tips do not keep these things near your bed while sleeping details inside ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Vastu Tips Do Not Keep These Things Near Your Bed While Sleeping Details Inside

Sleeping Vastu Tips : మీ తల పక్కన వీటిని పెట్టుకుని పడుకోకండి.. మీకే నష్టం!

HT Telugu Desk HT Telugu
Apr 24, 2023 02:01 PM IST

Telugu Vastu Tips : మనకు సౌకర్యంగా ఉండేందుకు మన దగ్గర కొన్ని వస్తువులు పెట్టుకుని నిద్రపోతాం. ఉదాహరణకు తల దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకుంటాం, ఫోన్ పెట్టుకుంటాం. అయితే పడుకునేప్పుడు కూడా కొన్ని పద్ధతులు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

వాస్తు టిప్స్
వాస్తు టిప్స్

చదువుతూ నిద్రపోవడం వల్ల కొందరు పుస్తకంతో నిద్రపోతారు. మరికొందరు ఫోన్ చూస్తూ.. నిద్రపోతారు. నిద్రపోతున్నప్పుడు ఇవన్నీ రోజువారీ దినచర్యలో భాగం. కానీ వాస్తు శాస్త్రంలో ఇలాంటి పద్ధతులు చెడు పద్ధతులుగా పేర్కొంటున్నారు. నిద్రపోయేటప్పుడు ఈ అలవాట్లు ఉంటే వారికి రకరకాల సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. నిద్రపోయేటప్పుడు తల దగ్గర ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్‌ని ఎప్పుడూ తలకు దగ్గరగా పెట్టుకోవద్దు. దీని వల్ల దాని నుంచి వెలువడే కిరణాలు మనపై ప్రభావం చూపుతాయి. వాస్తు ప్రకారం, ఈ రకమైన అలవాటు డబ్బు నష్టానికి దారితీస్తుంది. జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తల దగ్గర పెట్టుకుని పడుకోకండి.

రాత్రి పూట తల పక్కన పుస్తకం పెట్టుకుని పడుకోకండి. అది ఒకరి చుట్టూ ప్రతికూల శక్తిని పెంచుతుందని నమ్మకం. జీవితంలో పురోగతిని అడ్డుకుంటుంది. మీ జీవితంలో పురోగతి లేకుంటే, ఈ అలవాటు కారణం కావచ్చు. చదివాక.. పుస్తకాన్ని దూరంగా పెట్టి నిద్రపోండి.

చాలా మంది రాత్రి నిద్రపోయే ముందు చెవిపోగులు, కంకణాలు తీసి దిండు కింద పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం తలకింద బంగారం పెట్టుకుని పడుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది బంధాలలో కోపం, ఒత్తిడికి దారితీస్తుంది. ఈ అలవాటు ఉన్నవారు జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు.

అద్దం ఎప్పుడూ మంచానికి ఎదురుగా ఉండకూడదు. దాంపత్య జీవితంలో సమస్య పెరుగుతుంది. పడుకున్నప్పుడు మీ చిత్రం అద్దంలో ప్రతిబింబించకుండా ఉండటం ముఖ్యం. లేదంటే పీడకల వచ్చి భయపెడుతుంది.

చాలామంది తమ పడకగదిలో కడగని టీ కప్పును అలానే ఉంచుతారు. అలాంటి కప్పులను పడకగదిలో ఉంచితే పేదరికం వస్తుంది. నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి. మీకు మంచి నిద్ర రాకుండా చేస్తుంది. కొన్నిసార్లు మనం సోమరిపోతుల్లా ఉంటాం. మురికి బట్టలు మంచం మీద వదిలివేస్తాం. మురికి బట్టలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. మీ జీవితంలో మంచి ఏమీ జరగకపోతే, అది మీ మంచం మీద మురికి బట్టలు కారణంగా కావచ్చు.

చాలామంది పడుకునే ముందు వాటర్ బాటిల్ నింపుకొని తల పక్కన పెట్టుకుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇలా తల దగ్గర నీళ్ళు పెట్టుకుని నిద్రిస్తే మీ జాతకంలో చంద్రుడు దెబ్బతింటాడు. చంద్రుని స్థానం బాధింపబడి ఉంటే మానసిక సమస్యలకు లోనవుతారు. కాబట్టి పడుకునే ముందు తల దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకుని పడుకోకండి.

గమనిక : మాకు దొరికిన సమాచారం ఆధారంగా మాత్రమే ఈ కథనం ఇచ్చాం. ఏవైనా సందేహాలు ఉంటే.. సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్