వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించి, ఎటువంటి ప్రతికూల శక్తి ఉన్నా తొలగిపోతుంది. వాస్తు ప్రకారం మనం చేసే పొరపాట్లు సమస్యలకి దారితీస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం చేయకూడని పొరపాట్ల గురించి ఈరోజు తెలుసుకుందాం.
ప్రతీ ఒక్కరు కూడా ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటారు. నిజానికి ఇల్లు అందంగా ఉంటే లక్ష్మీదేవి కూడా ఆ ఇంట కొలువై ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ఇంటిని అందంగా అలంకరించుకుంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
మనం తెలియక కొన్ని కొన్ని వస్తువులను ఉంచుతూ ఉంటాము. కానీ వాటి వలన నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా వాస్తు ప్రకారం ఈ ఐదింటిని ఇంటి నుంచి తొలగించడం మంచిది. లేదంటే ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది.
ఎప్పుడైనా పనికొస్తాయని చాలా మంది పాత న్యూస్ పేపర్లని ఇళ్లల్లో ఉంచుతారు. కానీ వీటి వలన సానుకూల శక్తి తొలగిపోయి, ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఇంటి నుంచి తొలగించడం మంచిది.
చాలా మంది పాత తాళాలని ఇంట్లో ఉంచుతారు. వాటి వలన కూడా ప్రతికూల శక్తి కలుగుతుంది. విరిగిపోయిన తాళాలను పని చేయనివి, ఉపయోగించనివి ఇంట్లో నుంచి తొలగించడం మంచిది. లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకా ఎన్నో నష్టాలు కూడా సంభవిస్తాయి.
ఇంట్లో పని చేయని గడియారాలు ఉండకూడదు. ఇవి ప్రతికూల శక్తిని వ్యాపిస్తాయి. సానుకూల శక్తిని తొలగిస్తాయి. పని చేయని గడియారాలని రిపేర్ చేయించుకోవడం లేకపోతే వాటిని ఇంటి నుంచి తొలగించడమే మంచిది.
తెగిపోయినవి, వాడని షు, చెప్పులు ఇంట్లో ఉంచకూడదు. ఇవి ఇంట్లో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. జీవితంలో అనేక సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. శనివారం నాడు ఈ పాత వాటిని ఇంటి నుంచి తొలగిస్తే మంచిది.
వాస్తు ప్రకారం పాత బట్టలను కూడా ఇంట్లో నుంచి తొలగించాలి. ఎందుకంటే ఇవి దురదృష్టాన్ని కలిగిస్తాయి. చిరిగిపోయినవి, పనికిరాని దుస్తుల్ని ఎవరికైనా ఇవ్వడం మంచిది. లేదంటే కెరియర్ లో, ఉద్యోగంలో ఇబ్బందులు వస్తాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం