వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి కలుగుతుంది. ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన సంతోషంగా కూడా ఉండవచ్చు. చాలామంది వాస్తు ప్రకారం ఇంట్లో ఫోటోలు పెడుతూ ఉంటారు. వాటిని వాస్తు ప్రకారం పెట్టకపోతే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
పక్షులు స్వేచ్ఛ, సానుకూలతకు చిహ్నం. వీటిని సరైన దిశలో ఉంచితే శ్రేయస్సు, ఆనందం, శాంతి కలుగుతాయి. ఇంట్లో ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. పక్షుల చిత్రాలని ఏ దిశలో ఉంచితే మంచిది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఇంట్లో పక్షులు ఫోటోలు లేదా పెయింటింగ్స్, పక్షుల బొమ్మలు వంటివి ఉన్నట్లయితే అవి సానుకూల శక్తిని ఇస్తాయి. ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. పక్షులు ఫోటోలు, పెయింటింగ్స్ వంటివి ఇంట్లో ఉంటే ఎంతో శుభప్రదం. అయితే, సరైన దిశలో ఉంచితే సానుకూల శక్తి కలిగి సంతోషంగా ఉండవచ్చు.
ఉత్తరం: ఉత్తరం వైపు పక్షుల ఫోటోలు లేదా ఎగురుతున్న పక్షుల ఫోటోలు ఉంటే సానుకూల శక్తి కలగడంతో పాటుగా ఆర్థిక లాభాలని కొత్త అవకాశాలని పొందవచ్చు. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది.
దక్షిణం: ఈ వైపు ఎగురుతున్న పక్షులు లేదా అందమైన పక్షుల ఫొటోలను ఉంచితే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గుర్తింపు వస్తుంది.
తూర్పు: తూర్పు వైపు పక్షుల ఫొటోలను ఉంచడం వలన సానుకూల శక్తి కలుగుతుంది. పురోగతి, ఆనందాన్ని కూడా పొందవచ్చు. రిలేషన్ షిప్ లో ఆనందం కూడా ఉంటుంది.
ఈశాన్యం: పక్షుల ఫోటోలని పెట్టడానికి ఈశాన్యం కూడా సరైన దిక్కు. ఈ దిశలో పక్షుల ఫొటోలను పెడితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది.
పశ్చిమం: ఈ వైపు కూర్చున్న పక్షులు ఫోటోలు, పెయింటింగ్లు లేదా గుంపుగా ఉన్న పక్షుల ఫొటోలను ఉంచితే ఆర్థిక లాభాలను పొందవచ్చు. జీవితంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
వాయువ్యం: ఈ దిశలో ఎగిరే పక్షుల ఫొటోలను పెడితే మంచిది. ఇలా చేయడం వలన కొత్త అవకాశాలు వస్తాయి. ఆగ్నేయం వైపు రంగురంగుల పక్షుల ఫోటోలని పెడితే మంచిది. దీని వలన ఉత్సాహం కలుగుతుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
నైరుతి: ఈ వైపు పక్షుల ఫోటోలని పెడితే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రేమ పెరుగుతుంది. నైరుతి వైపు ఒంటరిగా ఉన్న పక్షి ఫోటోలను మాత్రం పెట్టకండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.