భార్యాభర్తల మధ్య ప్రతీ చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయా? అయితే ఈ వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి!-vastu shastra says not to do these mistakes or else problems between wife and husband increases ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  భార్యాభర్తల మధ్య ప్రతీ చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయా? అయితే ఈ వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి!

భార్యాభర్తల మధ్య ప్రతీ చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయా? అయితే ఈ వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి!

Peddinti Sravya HT Telugu

వాస్తు ప్రకారం పాటిస్తే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. చాలా మంది భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా దంపతుల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి.

ఇంట్లో గొడవలు జరగకుండా ఇలా చేయండి (pinterest)

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం జీవితం కొనసాగిస్తే, ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. చాలామంది భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతూ ఉంటాయి.

మీ ఇంట్లో కూడా దంపతుల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి. వాస్తు పండితులు చెప్తున్న ముఖ్య విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో గొడవలు జరగకుండా ఇలా చేయండి

చాలామంది ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు రావడం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. దానికి కారణం వాస్తు దోషాలు కూడా కావచ్చు. వాస్తు దోషాలను సరిదిద్దుకుంటే సమస్యలు తొలగిపోతాయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది, సంతోషంగా ఉండవచ్చు.

ఈ తప్పులు మీ ఇంట్లో జరగకుండా చూసుకోండి:

1.సరైన దిశలో పడకగది:

పడక గది ఎప్పుడూ సరైన దిశలో ఉండాలి. శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు బెడ్‌రూమ్‌లో వస్తువులను సర్దుకోవాలి. పడకగది నైరుతి దిశలో ఉండేటట్టు చూసుకోవాలి. మంచం సరైన దిశలో ఉండాలి. భయంకరమైన చిత్రాలు, యుద్ధాలకు సంబంధించిన ఫోటోలు ప్రతికూల శక్తిని వ్యాపింపజేస్తాయి. కనుక వీటిని బెడ్‌రూమ్ నుంచి తొలగించాలి.

2.వంటగది సరైన దిశలో ఉండాలి:

వంట గది సరైన దిశలో ఉండకపోతే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వస్తాయి. వంట గది ఈశాన్యం వైపుగా ఉంటే విభేదాలు పెరిగే అవకాశం ఉంది. కనుక వంటగదిని సరైన దిశలో ఉంచాలి.

3.టాయిలెట్లు సరైన దిశలో ఉండాలి:

టాయిలెట్లు ఈశాన్యం వైపుగా ఉంటే వాస్తు దోషాలు కలుగుతాయి. సరైన దిశలో టాయిలెట్లు లేకపోవడం వలన కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

4.ఇంట్లో శుభ్రత:

ఇంట్లో వస్తువులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. చెత్త, చెదారాన్ని తొలగించాలి. పనికిరాని వస్తువులు, పాడైపోయిన వాటిని ఇంట్లో నుంచి తొలగించాలి. ఇవి ప్రతికూల శక్తిని కలిగించవచ్చు, సానుకూల శక్తిని దూరం చేస్తాయి.

5.కుళాయిల లీక్‌ అవ్వకుండా:

ఇంట్లో కుళాయిలు లీక్ అయితే ఆర్థిక నష్టం, అశాంతి కలగవచ్చు. అందుకే రిపేర్ అయితే వెంటనే బాగు చేయించుకోవాలి.

6.గోడల రంగులు:

ఇంట్లో ఉండే గోడల రంగులు కూడా చాలా ముఖ్యమైనవి. నలుపు వంటి ముదురు రంగులు ఇంట్లో చెడు ప్రభావాన్ని కలిగించవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.