ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. చాలా మంది వాస్తు ప్రకారం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీని వలన ప్రతికూల శక్తి కలగడమే కాకుండా, చిన్న చిన్న నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది.
చాలా మంది నిద్రపోయేటప్పుడు కూడా వాస్తు శాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఏ దిశలో నిద్రపోవాలి, ఎటువైపు నిద్రపోవాలి లాంటి వాటిని అనుసరిస్తూ ఉంటారు. అలాగే వాస్తు ప్రకారం భార్య భర్తలు నిద్రపోయేటప్పుడు ఎవరు ఎటువైపు నిద్రపోతే మంచిదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం భార్య ఎప్పుడూ కూడా భర్త ఎడమవైపు నిద్రపోతే మంచిది. ఇలా నిద్రపోవడం వలన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంతోషంగా ఉండవచ్చు. ధనం కూడా కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బలంగా ఉంటాయి.
భర్తకు ఎడమ వైపు భార్య నిద్రపోవడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. భర్త ఆరోగ్యం కూడా బాగుంటుంది.
పురాణాల ప్రకారం శివుడు అర్ధనారీశ్వరుడు రూపంలో ఉన్నప్పుడు పార్వతీదేవి శివుడికి ఎడమవైపు ఉంది. కాబట్టి, హిందూమతంలో భార్యను వామంగి అని అంటారు. ఈ ప్రకారం భార్య భర్తకు ఎడమవైపు నిద్రపోతే మంచిది. అలాగే పూజలు చేసుకునే సమయంలో, వ్రతాలు చేసుకునే సమయంలో కూడా పీటల మీద కూర్చోవాల్సినప్పుడు భార్య భర్తకు ఎడమవైపునే కూర్చోవాలి.
పడక గది ఎప్పుడు కూడా దక్షిణం వైపు ఉంటే మంచిది. దక్షిణం వైపు తల పెట్టుకుని నిద్రపోవడం వలన ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ప్రేమానురాగాలు పెరుగుతాయి. జీవితంలో సంతోషం ఉంటుంది.
పడకగదిలో ఎప్పుడూ కూడా ప్రశాంతకరమైనవి సంతోషాన్ని ఇచ్చే ఫోటోలని ఉంచాలి. రాధాకృష్ణుని ఫోటో పెట్టుకుంటే భార్యా భర్తల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. యుద్దాలకి సంబంధించిన ఫోటోలు, భయంకరమైన ఫోటోలు, ముళ్ళ మొక్కలు, చీపురు, చెత్తాచెదారం వంటి వాటిని ఉంచకుండా చూసుకోవాలి. అలా ఉన్నట్లయితే భార్యాభర్తల జీవితంలో ఇబ్బందులు వస్తాయి. సానుకూల శక్తి తొలగిపోయి, ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.