వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఏ ఇబ్బంది కూడా ఉండదు. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు. వీటిని ఇంట్లో ఉంచినట్లయితే సమస్యలు వస్తాయి, దురదృష్టం కూడా కలుగుతుంది. మరి వాస్తు ప్రకారం ఇంట్లో వేటిని పెట్టకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మునిగిపోతున్న ఓడ ఫోటోలు వంటి వాటిని ఇంట్లో పెట్టడం వలన ప్రతికూల శక్తి కలుగుతుంది. సానుకూల శక్తి దూరమైపోతుంది. ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు రావచ్చు.
యుద్ధానికి సంబంధించిన ఫోటోలను ఇంట్లో పెట్టడం మంచిది కాదు. మహాభారతానికి సంబంధించిన యుద్ధ ఫోటోలను కూడా ఇంట్లో పెట్టకూడదు. వీటి వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోతుంది.
పిల్లలు ఏడుస్తున్న ఫోటోలను ఇంట్లో పెట్టడం మంచిది కాదు. అవి దురదృష్టాన్ని తీసుకొస్తాయి. నవ్వుతున్న పిల్లల ఫోటోలను ఇంట్లో పెడితే మాత్రం అదృష్టం కలిసి వస్తుంది. ఏడుస్తున్న పిల్లల ఫోటోలను పెడితే ఒత్తిడి పెరిగిపోతుంది, సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గులాబీ మొక్క ఫోటోలను ఇంట్లో పెట్టడం మంచిది కాదు. వీటి ముళ్లు ప్రతికూలతను సూచిస్తాయి. గులాబీ మొక్కల ఫోటోలను పెట్టడం వలన ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ ఫోటోలను ఇంట్లో పెట్టకండి.
ఇంట్లో నటరాజ విగ్రహాన్ని పెట్టడం వలన సానుకూల శక్తి తొలగిపోతుంది, ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. శివుడు తాండవం చేస్తున్న ఫోటో కోపాన్ని సూచిస్తుంది. అటువంటి ఫోటోలను పెట్టడం వలన ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.