Vastu: ఇంట్లో వంట గది ఏ దిశలో ఉండాలి? వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఈ మార్పులు చేస్తే ధనం, సంతోషం కలుగుతాయి
Vastu: ఎప్పుడూ కూడా ఇల్లు వాస్తు ప్రకారం ఉండేటట్టు చూసుకోవడం వలన సంతోషంగా ఉండడానికి కూడా అవుతుంది. వాస్తు దోషాల వలన ఇంట్లో సరైన శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అయితే, ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోయి, సంతోషంగా ఉండడానికి ఎలాంటి పరిహారాలని పాటించాలి, వంట గది కూడా ఏ దిశలో ఉండాలనేది తెలుసుకుందాం.
ప్రతీ ఒక్కరు కూడా వారి ఇంట్లో వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. అలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఎప్పుడూ కూడా ఇల్లు వాస్తు ప్రకారం ఉండేటట్టు చూసుకోవడం వలన సంతోషంగా ఉండడానికి కూడా అవుతుంది.

వాస్తు దోషాల వలన ఇంట్లో సరైన శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అయితే, ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోయి, సంతోషంగా ఉండడానికి ఎలాంటి పరిహారాలని పాటించాలి అనే విషయాలని తెలుసుకుందాం.
వాస్తు దోషాలకి ప్రధాన కారణాలు
వాస్తు నియమాలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం లేదా ఇల్లు ఏర్పాటు చేయడం వంటివి జరిగినప్పుడు వాస్తు దోషాలు తలెత్తుతాయి. అందుకు కారణాలు ఈ కింది వివరించబడ్డాయి.
1.ఇంటి ప్రధాన ద్వారం
మన ఇంట్లోకి శక్తి ప్రవేశించడానికి ప్రధాన ద్వారం ప్రధాన స్థానం. ఇది సరైన దశలో లేకపోయినట్లయితే ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది.
2.వంట గది సరైన దిశలో లేకపోవడం
వంట గది అగ్ని మూలకంతో అనుభవించబడింది. ఇది సరైన దిశలో లేనట్లయితే ఇంట్లో అసమతుల్యతను సృష్టించవచ్చు. వంటగది ఆగ్నేయం వైపు ఉంటే మంచిది.
3.టాయిలెట్స్
ఇంట్లో టాయిలెట్స్ సరైన దిశలో లేకపోవడం వలన వాస్తు దోషానికి కారణం అవ్వచ్చు.
4.సరైన ఆకారం
అర్థ చంద్రాకారం, త్రిభుజాకారంలో లేదా అసమానంగా ఉన్న ప్లాట్లపై నిర్మించిన ఇల్లు వాస్తు దోషాలని కలిగి ఉండే అవకాశం ఉంటుంది.
5.విరిగిపోయిన వస్తువులు
ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉండకూడదు. పగిలిపోయిన, విరిగిపోయిన వస్తువులు ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. సానుకూల శక్తిని దూరం చేస్తాయి.
వాస్తు దోషాల వలన ఎలాంటి ప్రభావం పడుతుంది?
- ఇంటి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరగడం
- అనారోగ్య సమస్యలు రావడం
- ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకోవడం
- కెరియర్ లో లేదా చదువులో ఆటంకాలు, ఇబ్బందులు
- రిలేషన్ షిప్ లో ఇబ్బందులు కలగడం
ఇంటికి మంచి ఎనర్జీని ఎలా తీసుకురావాలి?
- వాస్తు దోషాలు తొలగి పోవాలంటే ఇంట్లో ఈ వాస్తు పరిహారాలని పాటించండి. ఇవి సానుకూల శక్తిని తీసుకు వచ్చి ప్రతికూల శక్తిని దూరం చేస్తాయి.
- ఇంటి ముఖద్వారం సరైన దశలో ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంటే మంచిది. ఇంటి ముఖద్వారం ఈశాన్యం వైపు ఉంటే కూడా మంచి ఫలితం కనబడుతుంది.
- ఒకవేళ ఇల్లు సరైన దిశలో లేనట్లయితే పిరమిడ్ లేదా స్వస్తిక్ గుర్తును ప్రధాన ద్వారం పై ఉంచడం మంచిది.
- ఇంటి శుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇంట్లో మురికి, చెత్తాచెదారం పేరుకుపోకుండా చూసుకోవాలి.
- విరిగిపోయిన, పగిలిపోయిన వస్తువులు, పనికి రాని ఎలక్ట్రానిక్ సామాన్లు వంటివి ఉంటే తొలగించడం మంచిది.
- ఇంట్లో కచ్చితంగా తులసి మొక్క ఉండేటట్టు చూసుకోవాలి. ఇది సానుకూల శక్తిని తీసుకొస్తుంది. అలాగే లక్కీ బ్యాంబు మొక్క కూడా ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
- మెడిటేషన్ చేయడం వలన సానుకూల శక్తిని పొందవచ్చు. రెగ్యులర్ గా 'ఓం' మంత్రాన్ని జపించడం వలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది.
- ఇంటి గోడల రంగులు విషయానికి వస్తే లైట్ కలర్స్ ని ఉపయోగించండి. తెలుపు, లైట్ బ్లూ లేదా ఆకుపచ్చ రంగులు పాజిటివిటీని తీసుకువస్తాయి.
- పూజలు, యజ్ఞాలు చేయడం వలన కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు. వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగించుకోవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం