వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇంట్లో సంతోషంగా ఉండవచ్చు. చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. పైగా ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా సంతోషంగా ఉండాలని.. ధనం వారి ఇంట కొలువై ఉండాలని కోరుకుంటారు.
లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వాల్సి ఉంటుంది. అప్పులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీ ఇంట్లో కూడా డబ్బు నిలవట్లేదా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? అప్పుల బాధ నుంచి బయటపడలేకపోతున్నారా?, మీ అప్పులు ఎక్కువ అవుతున్నాయా అయితే ఇలా చేయండి.
చాలామంది ఇల్లు తుడిచేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. నిజానికి ఈ పొరపాట్ల కారణంగా అప్పుల సమస్యలు ఎక్కువవుతాయి. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. డబ్బు కూడా ఇంట్లో ఉండదు. ఈ తప్పులు చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. సంతోషం కూడా ఉండదు.
ఇల్లు తుడిచేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంటిని సూర్యాస్తమయం తర్వాత తోడవకూడదు. అలా తుడిచినట్లైతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.
ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇల్లు శుభ్రంగా లేకపోతే కూడా లక్ష్మీదేవి ఉండదు. ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో చెత్తాచెదారం ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
ఒకవేళ కనుక సాయంత్రం లేదా రాత్రి పూట కచ్చితంగా ఇల్లు తుడవాల్సిన పరిస్థితి వస్తే ఆ చెత్తని ఏదైనా సంచిలో పెట్టి, పక్కన పెట్టాలి లేదంటే డస్ట్ బిన్ లో పెట్టొచ్చు. అంతేకానీ దానిని బయట పారబోయకూడదు. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులకి లోటు ఉండదు. అప్పుల బాధలు కూడా ఉండవు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం