Vasantha Panchami: భారతదేశంలోని ఈ 5 ప్రదేశాలు వసంత పంచమిని జరుపుకోవడానికి ప్రత్యేకమైనవి.. మరి పూర్తి వివరాలు చూసేయండి-vasantha panchami 2025 these are the 5 places in india where they celebrated very specially check full details of them ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vasantha Panchami: భారతదేశంలోని ఈ 5 ప్రదేశాలు వసంత పంచమిని జరుపుకోవడానికి ప్రత్యేకమైనవి.. మరి పూర్తి వివరాలు చూసేయండి

Vasantha Panchami: భారతదేశంలోని ఈ 5 ప్రదేశాలు వసంత పంచమిని జరుపుకోవడానికి ప్రత్యేకమైనవి.. మరి పూర్తి వివరాలు చూసేయండి

Peddinti Sravya HT Telugu

Vasantha Panchami: వసంత పంచమిని మీరు జరుపుకోవాలని అనుకుంటే, ఈ ప్రదేశాల్లో జరుపుకోవచ్చు. ఈ ఐదు ప్రదేశాల్లో వసంత పంచమి పండుగను అత్యంత వైభవంగా జరుపుతారు. బెంగాల్, బెనారస్, గుజరాత్ లో గాలిపటాలని ఎగరవేస్తారు. సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.

Vasantha Panchami: భారతదేశంలోని ఈ 5 ప్రదేశాలు వసంత పంచమిని జరుపుకోవడానికి ప్రత్యేకమైనవి

హిందూమతంలో వసంత పంచమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతీ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఐదవ రోజు పంచమి నాడు వసంత పంచమి జరుపుకుంటాము. ఈ రోజున సరస్వతీ దేవిని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటాము. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధించడం వలన ఎంతో మంచి ఫలితం ఉంటుంది.

సరస్వతి దేవి అనుగ్రహం ఉంటుంది. వసంత పంచమిని మీరు జరుపుకోవాలని అనుకుంటే, ఈ ప్రదేశాల్లో జరుపుకోవచ్చు. ఈ ఐదు ప్రదేశాల్లో వసంత పంచమి పండుగను అత్యంత వైభవంగా జరుపుతారు. బెంగాల్, బెనారస్, గుజరాత్ లో గాలిపటాలని ఎగరవేస్తారు. సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.

వసంత పంచమిని ప్రత్యేకంగా జరుపుకునే 5 ప్రదేశాలు ఇవి

1.కలకత్తా, వెస్ట్ బెంగాల్

వసంత పంచమి సందర్భంగా కలకత్తాలో భారీ ఏర్పాట్లు చేస్తారు. బెంగాల్లో దాదాపు ప్రతి ఇంట్లో కూడా సరస్వతి దేవి ఆలయాలకు వెళ్లి ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఈ పండుగ బెంగాలీ హిందువుల ప్రధాన పండుగగా పరిగణించబడుతుంది. ఇంట్లో, పాఠశాలలో విద్యార్థులు సరస్వతీ పూజను జరిపిస్తారు. సరస్వతీ దేవి అనుగ్రహం కలగాలని విద్యార్థులు సరస్వతి దేవిని ప్రత్యేకించి ఆరాధిస్తారు.

2.వారణాసి, ఉత్తర్ ప్రదేశ్

శివుడు నగరం కాశీ, బనారస్ లేదా వారణాసిలో వసంత పంచమి పండుగను ప్రత్యేకించి జరుపుతారు. వారణాసిలో ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ పండుగను ఘాట్లపై జరుపుకుంటారు. బనారస్ లోని ఘాట్లపై సరస్వతి దేవి పూజలు జరుపుతారు.

3.జైపూర్, రాజస్థాన్

వసంత పంచమి పండుగను జైపూర్ లో కూడా బాగా జరుపుతారు. ప్రజలు భక్తశోదలతో సరస్వతీ దేవిని ఆరాధిస్తారు. ఇక్కడ ఆలయాన్ని కూడా అందంగా అలంకరిస్తారు.

4.అహ్మదాబాద్, గుజరాత్

వసంత పంచమి పండుగను అహ్మదాబాద్ లో కూడా ప్రత్యేకించి జరుపుతారు. ఈ పండుగ సమయంలో గాలిపటాలని ఎగరవేస్తారు. సరస్వతీ దేవి ఆరాధనతో భక్తులు పూజలు మొదలుపెడతారు. గాలిపటాలని ఎగురవేసి ఆనందిస్తారు. ఈ పండుగను చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారు.

5.ఢిల్లీ

వసంత పంచమిని ఢిల్లీలో కూడా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను చేసుకుంటారు. వివిధ ప్రాంతాలలో గాలిపటాలని ఎగరవేసి సరస్వతీ దేవిని ఆరాధిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

సంబంధిత కథనం