Vasantha Panchami: ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఈరోజు ఏం చేస్తే మంచిది? పిల్లలకు చదువు బాగా రావాలంటే ఇలా చేయండి-vasantha panchami 2025 date time and how to worship saraswathi devi on this day also check what students should do ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vasantha Panchami: ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఈరోజు ఏం చేస్తే మంచిది? పిల్లలకు చదువు బాగా రావాలంటే ఇలా చేయండి

Vasantha Panchami: ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఈరోజు ఏం చేస్తే మంచిది? పిల్లలకు చదువు బాగా రావాలంటే ఇలా చేయండి

Peddinti Sravya HT Telugu
Jan 23, 2025 01:30 PM IST

Vasantha Panchami: ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025న వచ్చింది. విద్య, వాక్కు, జ్ఞానానికి దేవత అయినటువంటి సరస్వతి దేవిని ఆ రోజు ఆరాధించడం వలన విశేష ఫలితాలని పొందవచ్చు. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని పూజించడం వలన సరస్వతి దేవి కటాక్షం కలుగుతుంది.

Vasantha Panchami: ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఈరోజు ఏం చేస్తే మంచిది?
Vasantha Panchami: ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఈరోజు ఏం చేస్తే మంచిది? (pinterest)

ప్రతీ సంవత్సరం మాఘ మాసంలో శుక్లపక్షం ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటాము. ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025న వచ్చింది. విద్య, వాక్కు, జ్ఞానానికి దేవత అయినటువంటి సరస్వతి దేవిని ఆ రోజు ఆరాధించడం వలన విశేష ఫలితాలని పొందవచ్చు. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని పూజించడం వలన సరస్వతి దేవి కటాక్షం కలుగుతుంది. అందుకని విద్యార్థులు కచ్చితంగా ఆ రోజు సరస్వతి దేవిని ప్రార్థిస్తారు.

సంబంధిత ఫోటోలు

సరస్వతి దేవిని పూజించడానికి అనుకూలమైన సమయం

వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఉదయం 7:09 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు పూజించొచ్చు. మాఘ శుక్ల పంచమి ఫిబ్రవరి 2న ఉదయం 9:14కు మొదలవుతుంది. ఫిబ్రవరి 3న ఉదయం 6:52 వరకు ఉంటుంది.

వసంత పంచమి నాడు ఏం చేస్తే మంచి జరుగుతుంది?

  1. వసంత పంచమి శుభకార్యాలకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది.
  2. వివాహం నుంచి గృహప్రవేశం వరకు ఈ రోజు కొత్త పనిని ప్రారంభించడానికి మంచిది.
  3. ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అందులో కచ్చితంగా విజయం వస్తుంది.
  4. గ్రంథాల ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా పరిగణించబడుతుంది. పంచాంగాన్ని చూడాల్సిన పని కూడా లేదు. ఈ రోజున ముహూర్తం చూడకుండా శుభకార్యాలని జరపవచ్చు.

వసంత పంచమి పూజ

  1. పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నా లేదంటే చదువు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వసంత పంచమి రోజు ఉదయం పవిత్రమైన సరస్వతి యంత్రాన్ని ఇంటి పూజ గదిలో పెట్టాలి.
  2. తెల్ల చందనాన్ని, పసుపు, తెలుపు పువ్వులని సమర్పించాలి.
  3. ధూప, దీపాలను వెలిగించాలి.
  4. 'ఓం హ్రీం హ్రీం హ్రీం సారస్వతియే నమః' అనే మంత్రాన్ని జపించాలి. 11 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే పిల్లల మేధో వికాసానికి సహాయపడుతుంది.
  5. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధించి పిల్లలకి పుస్తకాలు పంచడం మంచిది.
  6. ఈరోజు అవసరమైన పిల్లలకు పుస్తకాలని పంచడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లల మనసు ఆధ్యాత్మికత వైపు ఆసక్తి కలిగేలా చేయొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం