Vasantha Panchami 2025: ఈ సంవత్సరం వసంత పంచమి ఎప్పుడు వచ్చింది? ఈరోజు చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి-vasantha panchami 2025 date and what we should do on this day and also check what we should not do see here ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vasantha Panchami 2025: ఈ సంవత్సరం వసంత పంచమి ఎప్పుడు వచ్చింది? ఈరోజు చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి

Vasantha Panchami 2025: ఈ సంవత్సరం వసంత పంచమి ఎప్పుడు వచ్చింది? ఈరోజు చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu
Jan 28, 2025 03:00 PM IST

Vasantha Panchami 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమిని మాఘ మాసంలో శుక్లపక్షం పంచమినాడు జరుపుకుంటాము. వసంత పంచమి నాడు ప్రత్యేకించి సరస్వతీ దేవిని ఆరాధిస్తూ ఉంటాము. వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు.

Vasantha Panchami 2025: ఈ సంవత్సరం వసంత పంచమి ఎప్పుడు వచ్చింది? ఈరోజు చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి
Vasantha Panchami 2025: ఈ సంవత్సరం వసంత పంచమి ఎప్పుడు వచ్చింది? ఈరోజు చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి (freepik)

ప్రతీ సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమిని మాఘ మాసంలో శుక్లపక్షం పంచమినాడు జరుపుకుంటాము. వసంత పంచమి నాడు ప్రత్యేకించి సరస్వతీ దేవిని ఆరాధిస్తూ ఉంటాము. వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు.

సరస్వతీ దేవిని వసంత పంచమి నాడు ఆరాధించడం వలన విద్య బాగా వస్తుందని నమ్ముతారు. సనాతన ధర్మంలో వసంత పంచమికి ఉన్న ప్రాధాన్యత ఇంత అంతా కాదు. వసంత పంచమి నాడు పసుపు రంగులు దుస్తులు ధరించి, పసుపు రంగు పండ్లు, పూలు, దుస్తులు సరస్వతీ దేవికి పెట్టి పెట్టి పూజిస్తారు.

వసంత పంచమి నాడు నాలుగవ అమృత స్నానం

కుంభమేళాలో నాలుగవ అమృత స్నానం వసంత పంచమి నాడు ఉంటుంది. ఇప్పుడు ప్రయాగ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో నాలుగవ అమృత స్నానం వసంత పంచమి రోజు వచ్చింది కనుక, ఆ రోజు పెద్ద ఎత్తున భక్తులు కుంభమేళాలో స్నానం చేస్తారు.

2025 లో వసంత పంచమిని ఎప్పుడు జరుపుకోవాలి?

పండితులు చెప్పిన దాని ప్రకారం, మాఘ మాసంలో శుక్లపక్ష పంచమి ఫిబ్రవరి 2వ తేదీన వచ్చింది. ఈరోజు సరస్వతీ దేవిని ఆరాధించడం వలన విశేష ఫలితాలని పొందవచ్చు. సరస్వతిని కళా, జ్ఞానం, సంగీతానికి దేవత అని అంటారు.

ఆమె ఒక చేతిలో వీణ, ఇంకో చేతిలో పుస్తకం, మూడవ చేతిలో మాల, నాలుగవ చేతిలో ఆశీర్వాదం ఇచ్చే భంగిమలో ఉంటారు. వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని ఆరాధించడం ద్వారా కుటుంబమంతా ఆమె ఆశీర్వాదాలని పొందవచ్చని, జ్ఞానం కలుగుతుందని నమ్ముతారు.

వసంత పంచమి నాడు ఏం చేయాలి?

  1. వసంత పంచమి నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి.
  2. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
  3. ఆ తర్వాత పసుపు రంగు దుస్తుల్లో సరస్వతి దేవిని ఆరాధించడం మంచిది.
  4. సరస్వతీ దేవికి పసుపు రంగులో ఉండే దుస్తులు, పసుపు రంగు పూలు, సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
  5. పుస్తకాలను, పెన్నులని సరస్వతి దేవి ముందు పెట్టి పూజ చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.

వసంత పంచమి నాడు ఏం చేయకూడదు?

  1. వసంత పంచమి నాడు మొక్కలని కొట్టకూడదు. వసంతకాలం మొదలవుతుంది కాబట్టి చెట్లని, మొక్కలని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రకృతిని కాపాడాలి.
  2. వసంత పంచమి నాడు మాంసం, మద్యం వంటివి సేవించకూడదు. అలా చేయడం వలన చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వసంత పంచమి నాడు ఉపవాసం ఉండాలి. లేదా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం