హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో వసంత పంచమి ఒకటి. ప్రతీ సంవత్సరం వసంత పంచమిని మాఘమాసం శుక్లపక్షం ఐదవ రోజున జరుపుకుంటాము. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధించడం వలన సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుంది.
విద్యార్థులు కూడా సరస్వతి దేవికి వసంత పంచమి నాడు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి మనిషికి జ్ఞానం, వాక్కు అవసరం. సరస్వతీ దేవి జ్ఞానాన్ని అందిస్తుంది. విద్యార్థులు సరస్వతీ దేవిని ఆరాధించడం వలన చదువు బాగా వస్తుందని నమ్ముతారు. వసంత పంచమి నాడు కొన్ని విధానాలని పాటించడం వలన విజయాన్ని అందుకోవచ్చు.
ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 2న వచ్చింది. సరస్వతి దేవి అనుగ్రహాన్ని పొందడానికి వసంత పంచమి నాడు వీటిని మీ ఇంటికి తీసుకురండి. వసంత పంచమి నాడు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన చాలా మంచి ఫలితం కనబడుతుంది. మరి వసంత పంచమి నాడు ఏం తీసుకురావాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
వసంత పంచమి నాడు వేణువుని కానీ ఏదైనా సంగీత వాయిద్యాలని కానీ ఇంటికి తీసుకురావడం మంచిది. వీటిని ఇంటికి తీసుకురావడం వలన సానుకూల శక్తి ప్రవహించి, సంతోషంగా ఉండవచ్చు. అలాగే కళాకారులు వీటిని తీసుకువచ్చి పూజించడం వలన కళలో ఇంకా ఆరి తేరుతారు.
వివాహానికి సంబంధించిన బట్టలను వసంత పంచమి నాడు కొనుగోలు చేసినట్లయితే అదృష్టం కలుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషాన్ని పొందవచ్చు. కనుక దగ్గరలో వివాహం ఉన్నవారు వసంత పంచమినాడు వివాహ బట్టలు కొనుక్కోవడం మంచిది.
వసంత పంచమి నాడు వాహనాన్ని కొనుగోలు చేసి తీసుకు వస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ధనం కలుగుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
విద్యార్థులు వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని ఆరాధించడం వలన చదువు బాగా వస్తుంది. సరస్వతి దేవి అనుగ్రహం ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.