Vasantha panchami 2024: ఫిబ్రవరి 14న వసంత పంచమి, మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటించండి.. అపారమైన విజయం మీ సొంతం
Vasantha panchami 2024: వసంత పంచమి రోజు చేసే చిన్న పనులు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. ఫిబ్రవరి 14 న వసంత పంచమి జరుపుకుంటారు. విద్యార్థులతో ఈ పనులు చేయించడం వల్ల పరీక్షల్లో మంచి విజయాలు పొందుతారు.

Vasantha panchami 2024: ఫిబ్రవరి 14వ తేదీన వసంత పంచమి జరుపుకుంటారు. జ్ఞానం, వాక్కు, విద్యకి ప్రతీకగా సరస్వతీ దేవిని పూజిస్తారు. ఈరోజు పిల్లలు సరస్వతీ దేవిని పూజిస్తే చదువుల్లో బాగా రాణిస్తారని నమ్ముతారు. వసంత పంచమి రోజు సరస్వతీ మాతను ప్రసన్నం చేసుకోవడానికి ఈ చిన్న చిన్న పనులు చేయండి. అమ్మవారు సంతోషించి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. విజయ మార్గంలో వచ్చే అడ్డంకులని తొలగిస్తుందని నమ్ముతారు. వసంత పంచమి రోజు మీ రాశి ప్రకారం ఎటువంటి పరిహారాలు పాటించాలంటే..
మేష రాశి
వసంత పంచమి రోజు ఆరాధన సమయంలో సరస్వతీ కవచాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల మీకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది.
వృషభ రాశి
ఫిబ్రవరి 14 న సరస్వతీ మాతకు తెల్లని చందనంతో పూజ చేయండి. అలాగే పసుపు రంగు పువ్వులు సమర్పించండి. పసుపు రంగు అమ్మవారికి ప్రీతిప్రాతం. ఈ పరిహారం పాటించడం వల్ల మీ ప్రగతికి అడ్డుగా ఉన్న అవరోధాలు తొలగిపోతాయి.
మిథునం
మిథున రాశి జాతకులు పూజ సమయంలో సరస్వతీ దేవికి పెన్ను సమర్పించి, దానితో మీరు శుభకార్యాలు ప్రారంభించండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు విజయవంతం అవుతాయి.
కర్కాటకం
సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి వసంత పంచమి రోజు కర్కాటక రాశి వాళ్ళు ఖీర్ ని ప్రసాదంగా సమర్పించండి. మంచి జరుగుతుంది.
సింహం
సింహ రాశి వాళ్ళు పూజ సమయంలో గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు పఠించండి.
కన్యా రాశి
చదువు మీద ఏకాగ్రత కలగడం కోసం కన్యా రాశి వాళ్ళు వసంత పంచమి రోజున పేద పిల్లలకు పెన్నులు, పుస్తకాలు, పెన్సిళ్లు దానం చేయాలి. దీని వల్ల విద్యారంగంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి.
తులా రాశి
వసంత పంచమి రోజు తులా రాశి వాళ్ళు బ్రహ్మణుడికి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు దానం చేయాలి. అలాగే పసుపు లడ్డూ భోగాన్ని పూజలో సమర్పించాలి.
వృశ్చికం
వృశ్చిక రాశి జాతకులు చదువులో వెనుకబడి ఉంటే జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి సరస్వతీ దేవిని పూజించి ఆ రోజు పూజలో పెన్ను సమర్పించాలి. పూజ తర్వాత ఈ పెన్నుని పరీక్షలు రాసేందుకు ఉపయోగించండి. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వాళ్ళు శారదా మాతని ప్రసన్నం చేసుకోవడానికి పసుపు మిఠాయిలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
మకరం
వసంత పంచమి రోజు మకర రాశి జాతకులు పేదలకు ఆహార ధాన్యాలు, అవసరంలో ఉన్న వారికి ధనాన్ని దానం చేస్తే మంచిది.
కుంభ రాశి
ఫిబ్రవరి 14 న సరస్వతీ దేవి పూజ చేసుకోవాలి. అనంతరం పేడ విద్యార్థులకు చదువుకు సంబంధించి పెన్నులు, పుస్తకాలు వంటి వస్తువులు దానం చేయాలి.
మీన రాశి
మీన రాశి వారు వసంత పంచమి రోజున బ్రాహ్మణులకు పసుపు రంగు దుస్తులు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల కెరీర్ లో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.