Vasantha Panchami 2023 : వసంత పంచమి గురించి పురణాలు ఏమి చెప్తున్నాయంటే..-vasantha panchami 2023 know all about the auspicious festival of saraswathi puja ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Vasantha Panchami 2023 Know All About The Auspicious Festival Of Saraswathi Puja

Vasantha Panchami 2023 : వసంత పంచమి గురించి పురణాలు ఏమి చెప్తున్నాయంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 26, 2023 08:00 AM IST

Vasantha Panchami 2023 : దేశవ్యాప్తంగా జనవరి 26వ తేదీన వసంత పంచమిని జరుపుకుంటున్నారు. జ్ఞానం, అభ్యాసం వంటి వాటికోసం ఈరోజు సరస్వతీ దేవిని పూజిస్తారు. మరి ఈరోజు వెనుక ప్రాముఖ్యత, చరిత్ర ఏమిటి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సరస్వతి పూజా
సరస్వతి పూజా

Vasantha Panchami 2023 : వసంత పంచమి లేదా సరస్వతి పూజ అనేది జ్ఞానం, సంగీతం, అభ్యాసం వంటి వాటికోసం చేస్తారు. వీటిన్నింటికి సరస్వతీ దేవి మూలం కాబట్టి.. అమ్మవారిని ఈరోజు పూజిస్తారు. ఈ పండుగ కొత్త ప్రారంభాన్ని వర్ణించే వసంత రాకను సూచిస్తుంది. మరి ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి? పురాణాలు ఏమంటున్నాయి. ఈరోజు ఏమి చేయాలి వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

పండుగ ప్రాముఖ్యత

పండితులకు, విద్యార్థులకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న సరస్వతీ పూజ ఆరాధకులకు ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని ఇస్తుంది. సరస్వతి దేవి ప్రశాంతతను సూచిస్తుంది. అమ్మవారి నాలుగు చేతులు మనస్సు, అహం, చురుకుదనం, తెలివికి ప్రతీక.

ఈరోజు భక్తువు సాధారణంగా పసుపు బట్టలు ధరిస్తారు. పసుపు రంగు వంటకాలు తింటారు. పూజ సమయంలో పసుపు, తెలుపు పువ్వులను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇవి సరస్వతి దేవికి ఇష్టమైన రంగుగా చెప్తారు. పైగా ఇది ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

పండుగ వెనుక చరిత్ర

ఈరోజు చిన్న పిల్లలకు అధికారికంగా విద్యను పరిచయం చేస్తారు. ఈ వేడుకను అక్షరాభ్యాసం అంటారు. పురాణాల ప్రకారం.. ఈ రోజు సరస్వతీ దేవి ప్రమాదకరమైన రాక్షసుడైన మషాసురుడిని ఓడించడానికి శక్తివంతమైన ఆయుధాలను సృష్టించిందని చెప్తారు.

అందుకే ఈరోజు భక్తులు ఆయుధాలను పవిత్రంగా భావించి పూజిస్తారు. మరొక పురాణం ప్రకారం.. వసంత పంచమి రోజు సరస్వతీ దేవి శాస్త్రీయ కవి కాళిదాస్‌కు జ్ఞానాన్ని ప్రసాదించింది అంటారు.

పండుగ ఎక్కడ జరుపుకుంటారు?

ఈ పవిత్రమైన పండుగను భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియాలోని బాలిలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. బియ్యంతో చేసిన వంటకాలు, స్వీట్లను కుంకుమపువ్వును ఉపయోగించి తయారు చేస్తారు. పాఠశాలలు, కళాశాలల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజస్థాన్‌లో యువతులు, మహిళలు మల్లెపూల దండలు ధరించడం ఆచారంగా వస్తుంది.

పండుగకు సంబంధించిన ఆచారాలు

భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి.. స్నానం చేస్తారు. వేప, పసుపు కలిపిన పేస్ట్‌ని స్నానం చేసే ముందు శరీరమంతా పూసుకుని మంగళ స్నానం చేస్తారు. అనంతరం పసుపు రంగు దుస్తులు ధరించి.. అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. స్వీట్లు, పండ్లు, పువ్వులు, పుస్తకాలు, పెన్నులు, వాయిద్యాలు, స్టేషనరీలను అందిస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం