ప్రతీ సంవత్సరం వరూధిని ఏకాదశి మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ సంవత్సరం, వరూధిని ఏకాదశి 24 ఏప్రిల్ 2025, గురువారం నాడు ఉంది. ఈ సంవత్సరం వరూధిని ఏకాదశి నాడు బ్రహ్మ, ఇంద్ర యోగాల పవిత్ర కలయిక ఏర్పడుతోంది. జ్యోతిషశాస్త్రంలో ఈ రెండు యోగాలను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.
ఏకాదశి ఉపవాసం విష్ణు మూర్తికి అంకితం చేయబడింది. వరూథిని ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తిని పూజించి, ఆయన అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శ్రీ హరిని ప్రసన్నం చేసుకోవచ్చు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం, వివాదాలను పరిష్కరించడానికి ఇంద్ర యోగం, ఆస్తికి సంబంధించిన పనులను పరిష్కరించడానికి బ్రహ్మ యోగం పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రెండు యోగాలు కూడా మతపరమైన పనులకు పవిత్రమైనవిగా భావిస్తారు.
వరూధిని ఏకాదశి ఉపవాస దీక్ష ఏప్రిల్ 25, 2025, శుక్రవారం నాడు ఆచరించాలి. ఉపవాస దీక్షకు మంచి సమయం ఉదయం 05.46 నుండి 08.23 గంటల వరకు ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం