Varalakshmi vratam: వరలక్ష్మీ వ్రతం పూజ చేసుకునేందుకు శుభ ముహూర్తం, పూజా విధానం, పఠించాల్సిన మంత్రాలు
Varalakshmi vratam: వరలక్ష్మీ వ్రతం శుభ ముహూర్తం , పూజా విధానం, జపించాల్సిన పదకొండు మంత్రాల జాబితా ఇక్కడ చూడొచ్చు. ఏ మంత్రం పఠిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే..
Varalakshmi vratam: ఆనందకరమైన వైవాహిక జీవితం, ఆర్థిక పురోభివృద్ధి, కుటుంబంలో సామరస్య పూర్వకమైన వాతావరణం ఇవ్వమని కోరుకుంటూ మహిళలు వరలక్ష్మీ దేవిని పూజిస్తారు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలోని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆగస్ట్ 16వ తేదీ వరలక్ష్మీ వ్రతం వచ్చింది. స్త్రీలు తెల్లవారు జామునే నిద్రలేచి తలస్నానం చేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. వరలక్ష్మీ వ్రతం పూజ చేసుకునేందుకు శుభ సమయం ఎప్పుడూ ఉందో తెలుసుకుందాం.
శుభ ముహూర్తం
సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం 5. 57 నుంచి 8.14 వరకు
వృశ్చిక లగ్న పూజ ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుంచి 3.08 గంటల వరకు
కుంభ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం 6:55 నుంచి 8.22 వరకు
వృషభ లగ్న పూజ ముహూర్తం రాత్రి 11.22 నుంచి 1.18 వరకు తెల్లవారితే ఆగస్ట్ 17
'వర' అంటే వరం లేదా ఆశీర్వాదం. లక్ష్మీ సంపద దేవతను సూచిస్తుంది. అటువంటి దేవతను ఆహ్వానిస్తూ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహిత స్త్రీలు తమ భర్త, కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ఈ పూజ చేస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంతగా భావిస్తారు.
వరలక్ష్మీ వ్రతం పూజా విధానం
తెల్లవారుజామున నిద్ర లేచి స్నానమాచరించి పూజగది, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. గడపలకు పసుపు కుంకుమ రాసుకోవాలి. పూజ గదిలో బలిపీఠం ఏర్పాటు చేసుకోవాలి. బియ్యపిండితో ముగ్గు వేసుకొని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. అనంతరం కలశాన్ని ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీ దేవి ప్రతిమను పెట్టుకోవచ్చు. లేదంటే కలశం మీద కొబ్బరికాయను ఉంచి రవిక గుడ్డ పెట్టి పసుపు, కుంకుమ రాశి అమ్మవారి రూపాన్ని చేసుకోవచ్చు. అమ్మవారిని ఆవాహనం చేస్తూ షోడపచారాలతో పూజ చేయాలి. అష్టోత్తర శతనామావళి, కనకధారా స్తోత్రం పఠించాలి. దేవతకు పండ్లు, పూలు, స్వీట్లు, సాంప్రదాయం వస్తువులు నైవేద్యంగా సమర్పించాలి. వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి.
అమ్మవారి ఆశీర్వాదం పొందేందుకు లక్ష్మీదేవికి సంబంధించిన ఈ మంత్రాలను పఠించవచ్చు. సంపద, సమృద్ధిని ఆకర్షించేందుకు వరలక్ష్మీ వ్రతంలో ఈ పదకొండు శక్తివంతమైన మంత్రాలు జపించండి.
1. ఓం శ్రీం మహా లక్ష్మీయే నమః: లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని కోరే మంత్రం.
2. ఓం లక్ష్మీ నారాయణి నమః: శ్రేయస్సు, ఆనందాన్ని ఇవ్వమంటూ ఈ మంత్రం జపించాలి.
3. శ్రీం వక్రతృస్తంభే నమః: ఆర్థిక విజయానికి శక్తివంతమైన మంత్రం.
4. ఓం మహా లక్ష్మీయై విద్మహే: సంపద, శ్రేయస్సు కోసం ఒక వేద మంత్రం.
5. ఓం లక్ష్మీ దేవ్యై నమః: లక్ష్మి అనుగ్రహం కోరుకుంటూ పఠించాల్సిన శక్తివంతమైన మంత్రం.
6. ఓం శ్రీం క్లీం లక్ష్మీ విద్మహే: సంపద, సమృద్ధిని ఆకర్షించే మంత్రం.
7. ఓం లక్ష్మీ నారాయణాయ నమః: వైవాహిక సామరస్యం, శ్రేయస్సు కోసం ఒక మంత్రం.
8. శ్రీం శ్రీం శ్రీం మహా లక్ష్మీయే నమః: వేగవంతమైన ఆర్థిక వృద్ధికి మంత్రం.
9. ఓం లక్ష్మీ రామాయ నమః: అంతర్గత శాంతి, శ్రేయస్సు కోసం ఈ మంత్రం జపించాలి.
10. ఓం మహా లక్ష్మీయై నమః సర్వ మంగళం: మొత్తం శ్రేయస్సు, సంతోషం కోసం మంత్రం జపించండి.
11. ఓం శ్రీం మహా లక్ష్మీయై సర్వ సిద్ధియాయ విద్మహే: ఆధ్యాత్మిక వృద్ధి, జ్ఞానోదయం కోసం ఒక మంత్రం పఠించాలి.