Varalakshmi vratam: వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి-varalakshmi vratam puja samagri full list and puja vidhanam details in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి

Varalakshmi vratam: వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu
Aug 09, 2024 06:01 PM IST

Varalakshmi vratam: ఆగస్ట్ 16న వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. ఈరోజు పూజకు కావాల్సిన సమగ్ర వస్తువుల జాబితా, పూజా విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి.

వరలక్ష్మీ వ్రతం పూజా విధానం
వరలక్ష్మీ వ్రతం పూజా విధానం (pinterest)

Varalakshmi vratam 2024: సంపద, సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది ఆగస్ట్ 16న వరలక్ష్మీ వ్రతం వచ్చింది. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారు. ఈరోజు వరలక్ష్మీ దేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత ఫలితం దక్కుతుంది.

ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీ దేవికి వివరించినట్టుగా స్కంద పురాణం చెబుతోంది. శ్రీహరి మహా విష్ణువు జన్మించిన శ్రవణా నక్షత్రంలో వచ్చే మాసమే శ్రావణ మాసం. అటువంటి పవిత్రమైన మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతం చేసుకునేందుకు కావాల్సిన పూజా సామాగ్రి, పూజా విధానం గురించి తెలుసుకుందాం.

పూజా సామాగ్రి

పసుపు

కుంకుమ

వాయనాలకు అవసరమైన వస్తువులు

ఎరుపు రంగు రవిక వస్త్రం

గంధం

పూలు

పండ్లు

తమలపాకులు

వక్కలు

తోరము కట్టేందుకు దారం

కొబ్బరికాయ

దీపం కుందులు

ఐదు వత్తులతో హారతి ఇచ్చేందుకు అవసరమైన పంచహారతి పళ్ళెం

దీపారాధనకు నెయ్యి

కర్పూరం

అగర్ వత్తులు

బియ్యం

శనగలు

చిల్లర నాణేలు

అమ్మవారి కలశం ఏర్పాటుకు కావలసిన పీట

అక్షింతలు

పూజా విధానం

వ్రతం ఆచరించే వాళ్ళు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకుని గడపలకు పసుపు, కుంకుమ రాసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందమైన రంగవల్లులు వేసుకోవాలి.

అమ్మవారి కలశ స్థాపన కోసం మండపం ఏర్పాటు చేసుకుని బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి. తర్వాత కలశం స్థాపించుకోవాలి. కలశం మీద కొబ్బరి కాయ లేదంటే అమ్మవారి ముఖ స్వరూపం పెట్టుకోవాలి. చీర, నగలు, పువ్వులు వేసి అందంగా అలంకరించుకోవాలి. ముందుగా పసుపు గణపతి పూజ చేసుకోవాలి.

శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

అంటూ శ్లోకం పఠిస్తూ పూజ చేయాలి. అనంతరం కలశంలోని వరలక్ష్మీ దేవిని ఆవాహనం చేసుకుంటూ షోడపోశపచార పూజ అథాంగ పూజ చేయాలి. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ధూపం, దీపం, నైవేద్యాలు సమర్పించాలి. అమ్మవారి కోసం చేసిన పిండి వంటలు, పాయసం, పరమాన్నం, పప్పు, నెయ్యి ప్రసాదాలు నివేదించాలి. కర్పూర హారతి ఇచ్చి మంత్ర పుష్పం సమర్పించాలి. శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః ప్రదక్షిణం సమర్పయామి అనుకుంటూ ఆత్మప్రదక్షిణ చేసుకోవాలి.

తోరాన్ని తయారు చేసుకుని తోరగ్రంథి పూజ చేసుకోవాలి. ఆ కంకణాన్ని చేతికి ధరించాలి. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, శనగలు, కుడుములు పెట్టి వాయనం సమర్పించాలి. చివరగా పూజకు వచ్చిన ముత్తైదువుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మీగా భావించి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. వ్రతం రోజు వరలక్ష్మీ వ్రతం కథ విన్నా, చదివినా సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సంపద వృద్ధి కలుగుతాయి.