మే 23, నేటి రాశి ఫలాలు.. వైశాఖ పౌర్ణమికి ఎవరికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందో చూడండి-vaishaka porunami 2024 may 23rd today rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 23, నేటి రాశి ఫలాలు.. వైశాఖ పౌర్ణమికి ఎవరికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందో చూడండి

మే 23, నేటి రాశి ఫలాలు.. వైశాఖ పౌర్ణమికి ఎవరికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందో చూడండి

HT Telugu Desk HT Telugu
May 23, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ23.05.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 23వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 23వ తేదీ నేటి రాశి ఫలాలు (pinterest)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 23.03.2024

వారం: గురువారం, తిథి : పౌర్ణమి,

నక్షత్రం : విశాఖ, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యుల సహాయ సహకారాలుంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్నాను. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. మీరు చేసే ప్రతీ పని సత్ఫలితాలనిస్తాయి. అవకాశాలు కలసివస్తాయి. గత ఇబ్బందులను దూరం చేసుకుంటారు. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి కనబరుస్తారు. అందుకు అవసరమైన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయమై మిత్రులుగా మారతారు. రుణాలు తీరతాయి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్జి పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలుంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. జీవిత భాగస్వామి నుంచి ధన లాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమ తప్ప ఫలితం ఉండదు. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు పొందుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాలలో అఖివృద్ధి సాధిస్తారు. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. దుబారా ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. సింహరాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శంకరాచార్య విరాచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పరించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబములో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం గురించి అధికంగా ఆలోచిస్తారు. రుణాలు చేస్తారు. మీ మీద ఉన్న బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన చికాకులు కొంతవరకు తీరుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తీరతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. శత్రువులతో జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపారపరంగా లాభాలున్నాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులను కలసి ఆనందముగా గడుపుతారు. సభలు, సమావేశాలు చురుకుగా పాల్గొంటారు. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. ఆరోగ్య సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి. రుణాల నుంచి విముక్తి పొందుతారు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి. పనులలో ఎదురైన ఆటంకాలు, చికాకులు కొంతవరకు తీరతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించాలి.

మీన రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి చూపిస్తారు. శుభవార్తలు వింటారు. అనుకున్న కార్యక్రమంలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదల పెరుగుతుంది. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel