Vaikuntha Ekadashi:రేపు వైకుంఠ ఏకాదశి.. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలగడంతో మోక్షం కూడా పొందవచ్చు
Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే కూడా మంచి జరుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం, ఉపవాసం చేయడం, తోచినది దానం చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. పుణ్యం వస్తుంది.
ఏకాదశి తిధి విష్ణుమూర్తికి అంకితం చేశారు. ఏకాదశికి హిందూమతంలో ఎంతో ప్రత్యేకత ఉంది. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఏకాదశి నాడు చాలామంది విష్ణుమూర్తిని భక్తశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే కూడా మంచి జరుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం, ఉపవాసం చేయడం, తోచినది దానం చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. పుణ్యం వస్తుంది.
విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే వైకుంఠ ఏకాదశి నాడు వేటిని దానం చేస్తే మంచిది?
- విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే వైకుంఠ ఏకాదశి నాడు గోవును దానం చేయడం మంచిది. చాలా కాలం నుంచి ఈ సాంప్రదాయం వస్తోంది.
2. గోవుని దానం చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా సంపదలు కలుగుతాయి. సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది.
3. వైకుంఠ ఏకాదశి నాడు డబ్బులు దానం చేయవచ్చు. ఇలా చేస్తే కూడా మంచి జరుగుతుంది.
4. అలాగే అన్నం, బట్టలు వంటివి కూడా లేని వాళ్ళకి ఇవ్వచ్చు. దాని వలన పుణ్యం కలుగుతుంది.
5. విష్ణుమూర్తి అనుగ్రహం కలగడానికి వైకుంఠ ఏకాదశి నాడు తులసి మొక్కని దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.
వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత తెలుసా?
- వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం, ఉపవాసం చేయడం వలన మనసులో మాలిన్యాలు తొలగిపోతాయి.
2. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన, ఉపవాసం చేయడం వలన కష్టాలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు.
3. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మోక్షం కలుగుతుంది. స్వర్గానికి చేరుకుంటారని చాలా మంది నమ్ముతారు.
4. చనిపోయిన తర్వాత ఇంకో జన్మ లేకుండా మోక్షాన్ని పొందడానికి వైకుంఠధామంలో స్థానం పొందడానికి ఇలా వైకుంఠ ఏకాదశి నాడు అనుసరించడం మంచిది.
వైకుంఠ ఏకాదశి నాడు ఎలాంటి తప్పులు చేయకూడదు?
- వైకుంఠ ఏకాదశి నాడు మాంసాహారం తీసుకోకూడదు.
2. అబద్ధాలు చెప్పడం, ఆగ్రహానికి గురవ్వడం వంటివి చేయకూడదు.
3. వైకుంఠ ఏకాదశి నాడు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.
4. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదు.
వైకుంఠ ఏకాదశి నాడు ఇలా విష్ణుమూర్తిని ఆరాధించండి
- ముందు పూజ గదిని శుభ్రంగా ఉంచుకుని అందమైన పూలతో అలంకరించుకోవాలి.
2. లక్ష్మీనారాయణ చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి.
3. లక్ష్మీనారాయణ ఫోటో లేకపోతే కృష్ణుడు, రాముడు, నరసింహస్వామి ఇలా విష్ణురూపాలు ఏదైనా సరే ఉంచవచ్చు.
4. ఫోటో ఎదురుగా ప్రమిదని పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసి మూడు వత్తులు విడిగా వేసి దీపారాధన చేయాలి.
5. విష్ణు మూర్తికి ఇష్టమైన తుమ్మి పూలు, జాజిపూలు, తెల్లగన్నేరు, నందివర్ధనం వంటి వాటిని ఉపయోగించవచ్చు.
6. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ మంత్రాలతో విష్ణుమూర్తిని ఆరాధించవచ్చు.
7. ఈ మంత్రాలని 21సార్లు చదువుతూ పువ్వులతో పూజ చేయాలి.
8. విష్ణు సహస్ర పారాయణం చేసినా లేదంటే విన్నా పాపాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మోక్షాన్ని పొందవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం