Unlucky Rasis: ఈ సంవత్సరం మిమ్మల్ని బాధ పెడుతుంది, రాబోయే 11 నెలలు కష్టాలే.. 2025లో అత్యంత దురదృష్టకరమైన రాశులు ఇవి
Unlucky Rasis: గత సంవత్సరం 2024 లో శని, రాహువు, కేతువు వారి రాశి చక్ర గుర్తులని మార్చలేదు. ఈ ఏడాది ఈ మూడు ముఖ్యమైన గ్రహాల సంచారం భారీ మార్పుని తీసుకురాబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ సంవత్సరం కష్టతరంగా మారుతుంది.
2025లో శని, బృహస్పతి, రాహువు కేతువులు లాంటి నిదానంగా కదిలే గ్రహాలు కూడా రాశిని మార్చుకోబోతున్నాయి. 2025 లో మొత్తం తొమ్మిది గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇది 12 రాశుల జీవితాల పై పెద్ద ప్రభావం పడబోతోంది. శని తన రాశిని రెండున్నర సంవత్సరాల్లో మార్చుకుంటే.. రాహువు, కేతువులు ఒకటిన్నర సంవత్సరాలు, బృహస్పతి ఒక సంవత్సరంలో మారుతుంది.

గత సంవత్సరం 2024 లో శని, రాహువు, కేతువు వారి రాశి చక్ర గుర్తులని మార్చలేదు. ఈ ఏడాది ఈ మూడు ముఖ్యమైన గ్రహాల సంచారం భారీ మార్పుని తీసుకురాబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ సంవత్సరం కష్టతరంగా మారుతుంది.
కొన్ని రాశుల వారికి మాత్రం ఈ కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది. కానీ కొందరికి మాత్రం ఇబ్బందులు తప్పవు. ఈ 11 నెలలు ఇబ్బంది పడబోతున్న రాశుల వారి గురించి చూద్దాం.
2025లో ఈ రాశుల వారికి దురదృష్టం తప్పదు
1.మేష రాశి
శని సంచారం వలన మేష రాశిలో శని గ్రహ సడే సతి మొదలవుతుంది. దీని కారణంగా అనేక రకాల ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కోవాలి. ఆసుపత్రిలో డబ్బు ఖర్చు అవుతుంది. ఆందోళన ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరీర్ కి కూడా సమయం మంచిదని చెప్పలేము.
2.మిధున రాశి
మిధున రాశిలో జన్మించిన వ్యక్తులు మాటల్ని అదుపులో పెట్టుకోకపోవడం, కోపం కారణంగా తమకి తాము హాని కలిగించుకుంటూ ఉంటారు. మీ వృత్తి జీవితంపై చెడు ప్రభావం పడుతుంది. మీ ఇమేజ్ దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు రావచ్చు.
3.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి 2025 లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో, ప్రేమ జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అసలు విశ్రాంతి లేకుండా శ్రమించాల్సి ఉంటుంది. నెగెటివ్ గా ఆలోచించి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కెరియర్ లో కూడా పైకి రావడం కష్టమే.
4.సింహ రాశి
సింహ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయంలో తగ్గుదల, ఇబ్బందులు కలగొచ్చు. రిలేషన్ షిప్ కి సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ పై నమ్మకాన్ని కోల్పోవడం లేదంటే ప్రేమ తగ్గిపోవడం లాంటివి కలుగుతాయి.
5.మీన రాశి
మీన రాశి వారికి కొత్త సంవత్సరం ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వస్తాయి. శారీరక సమస్యలు, మానసిక సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు. పిల్లలకి సంబంధించి ఇబ్బందులు కలగొచ్చు. డబ్బుని జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం