Ugadi Astro Tips: ఉగాది నాడు ఈ 7 వస్తువులను ఇంటికి తీసుకు వస్తే దరిద్రం పోతుంది.. ధన యోగం, ఐశ్వర్య యోగం కలుగుతాయి!-ugadi astro tips bring these 7 things to your home for dhana yogam and aishwarya yogam problems will go away ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Astro Tips: ఉగాది నాడు ఈ 7 వస్తువులను ఇంటికి తీసుకు వస్తే దరిద్రం పోతుంది.. ధన యోగం, ఐశ్వర్య యోగం కలుగుతాయి!

Ugadi Astro Tips: ఉగాది నాడు ఈ 7 వస్తువులను ఇంటికి తీసుకు వస్తే దరిద్రం పోతుంది.. ధన యోగం, ఐశ్వర్య యోగం కలుగుతాయి!

Peddinti Sravya HT Telugu

Ugadi Astro Tips: ప్రతీ కల్పంలో ముందు వచ్చేది ఉగాది. యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని చెప్తూ ఉంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు ఈ 7 వస్తువులను ఇంటికి తీసుకు వస్తే దరిద్రం పోతుంది. ధన యోగం, ఐశ్వర్య యోగం కలుగుతాయి.

కొత్త సంవత్సరం నాడు ఇంటికి తెచ్చుకోవాల్సినవి, పాటించాల్సిన పరిహారాలు (pinterest)

ఈసారి ఉగాది పండుగ మార్చి 30న వచ్చింది. ఉగాది నాడు ఇంటికి వీటిని తెచ్చుకుంటే ఎంతటి దరిద్రమైనా సరే తొలగిపోతుంది. కటిక దరిద్రుడైనా కూడా రాజ్యమేలుతాడు. బ్రహ్మ గత ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పమంటారు. ప్రతీ కల్పంలో ముందు వచ్చేది ఉగాది. యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని చెప్తూ ఉంటారు.

ఉగాది పండుగ

ఉగాది పర్వదినం చైత్రమాసంలో మొదలవుతుంది. ఆ రోజు నుంచి కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త తెలుగు సంవత్సరాన్ని తెలుగు వారందరూ కూడా ఉగాది పచ్చడితో మొదలు పెడతారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా ఉగాదిని జరుపుకుంటారు.

చైత్రమాసం మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు. ఈరోజు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. కవులందరూ కలిసి ఈరోజు కవి సమ్మేళనాలను కూడా జరుపుతారు. అయితే, ఈ కొత్త సంవత్సరం నాడు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చి పెట్టుకుంటే సంవత్సరం అంతా మీ ఇంట కాసులు వర్షం కురుస్తుంది. అన్నీ శుభాలే జరుగుతాయి.

ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది. కుబేరులుగా మారిపోవచ్చు. కొత్త సంవత్సరం మీకు డబ్బుకి లోటు ఉండదు. అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందవచ్చు. అపార ధన యోగము, ఐశ్వర్య యోగము కూడా కలుగుతాయి.

కొత్త సంవత్సరం నాడు ఇంటికి తెచ్చుకోవాల్సినవి, పాటించాల్సిన పరిహారాలు

1.ఉప్పు

కొత్త సంవత్సరం నాడు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి. ఉగాది రోజు ఉప్పుని కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి ఆనందానికి లోటు ఉండదు. ఉగాది రోజు తప్పక ఉప్పుని ఇంటికి తెచ్చి పెట్టుకోండి. ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ని ఉగాదిని నాడు కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి లోటు ఉండదు, పట్టిందల్లా బంగారమే.

రాజయోగం ఏర్పడుతుంది. అపార ధన యోగం కలుగుతుంది. ఉగాది నాడు ఉప్పుని దేవుడు ముందు పెట్టి, ఆ తర్వాత వంట గదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. లేకపోతే ఉప్పుతో పరిహారాలు కూడా చేసుకోవచ్చు.

2.దక్షిణావృత శంఖం

ఉగాది నాడు దక్షిణావృత్త శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చి పెట్టుకుంటే, శుభ ఫలితాన్ని పొందవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఇది ఉన్నట్లయితే మళ్లీ కొన్ని తెచ్చుకోక్కర్లేదు. ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచాలి.

లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది. దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుంచి వచ్చాయి. వీటిని లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు. కాబట్టి, వీటిని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు దేనికి లోటు ఉండదు.

3.తాటి ఆకు ముక్క

తాటి ఆకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. అమ్మవారు చెవులకు కమ్మ తాటి ఆకులని ఉపయోగించిందని పురాణాలు కూడా చెప్తున్నాయి. అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం. పూర్వం సంతానం కోసం ఈ ఆకులని ఎర్రని వస్త్రంలో మూట కట్టేవారు. తాటి ఆకుని ఉగాది నాడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

4.లక్ష్మీ గణపతి విగ్రహం

ఉగాది నాడు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చి, పూజ మందిరంలో పెట్టడం వలన కొత్త సంవత్సరం అన్ని శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

5.తామర పూసలు

తామర పూసలు మాలని తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే కూడా ఏడాది అంతా శుభ ఫలితాలను పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

6.ఏకాక్షి నారికేళం

మామూలు నారికేళానికి మూడు కళ్ళు ఉంటాయి. కానీ ఏకాక్షి నారికేళానికి ఒకే ఒక కన్ను ఉంటుంది. దీనిని ఉగాది నాడు పూజ గదిలో పెడితే అదృష్టం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం ఉంటుంది.

7.గోమతి చక్రాలు

గోమతి చక్రాలని కూడా లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తా. ఉగాది గోమతి చక్రాలని ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టండి. దీనితో ధన సమస్యలు తొలగిపోతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం