జూలై నెలలో రెండు గ్రహాలు తిరోగమనం చెందుతాయి. దీంతో కొన్ని రాశులకు సవాళ్లు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. జూలై నెల చాలా ముఖ్యమైన నెల కాబోతుంది.
ఈ సమయంలో మూడు గ్రహాలు శని, బుధుడు, వరుణుడు తిరోగమన కదలికలోకి ప్రవేశిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల తిరోగమనం సాధారణ సంఘటనగా పరిగణించబడదు. జీవితంలో అనేక విధాలుగా గ్రహాల తిరోగమన ప్రభావం చూపిస్తుంది. వ్యక్తి వేసుకునే సామర్థ్యం, సంబంధాలు, చర్యలపై ఇవి తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా మూడు గ్రహాలు తిరోగమనం చెందడం వల్ల ఈ ప్రభావం మరింత శక్తివంతంగా ఉంటుంది.
శని న్యాయ దేవుడు. మనం చేసే మంచి పనులకు మంచి ఫలితాలను, చెడు పనులకు చెడు ఫలితాలను ఇస్తాడు. కమ్యూనికేషన్‌తో సంబంధం ఉన్న బుధుడు కూడా ఈ సమయంలో ఇబ్బందులను కలిగిస్తాడు. ఊహ, ఆధ్యాత్మికతకు కారకుడైన వరుణుడు కూడా తిరోగమనం చెందుతాడు.
ఈ మూడింటి తిరోగమనం కొన్ని రాశుల వారికి సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉంది. అయితే, ఏ రాశుల వారికి గ్రహాల తిరోగమనం సమస్యలను తీసుకువస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బుధుడి తిరోగమనం కారణంగా సింహ రాశి వారికి చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కెరీర్‌లో ఈ రాశి వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పని ప్రదేశంలో చిన్న తప్పు చేసినా పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో టెన్షన్ ఎక్కువ అవుతుంది. భాగస్వామితో చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామితో నిజాయితీగా ఉండండి. అసత్యం చెప్పడం వలన పెద్దపెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది.
తులా రాశి వారికి శని, బుధుడు తిరోగమనం వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి. చిన్నపాటి సమస్యల్ని కూడా లైట్ తీసుకోవద్దు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు రెండు సార్లు ఆలోచించండి.
కుంభ రాశి వారికి జూలైలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రహాలు తిరోగమనం చెందడం వలన కుంభరరాశి వారికి ఇబ్బందులు రావచ్చు. ఎవరితోనైనా ఇబ్బందిగా ఉంటే, వారికి దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక నష్టం, సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. ఇలా జూలై నెలలో ఈ రాశి వారు కూడా చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.