వరూథిని ఏకాదశి నాడు మహా విష్ణువుని ఆరాధించడం వలన ప్రత్యేక ఫలితాన్ని పొందవచ్చు. ఈసారి ఏప్రిల్ 24న గురువారం నాడు వరూధిని ఏకాదశి వచ్చింది. ఈరోజు శతభిష, పూర్వాభాద్ర నక్షత్రాల కలయిక కూడా ఏర్పడుతుంది. ఈ పర్వదినాన బ్రహ్మయోగం, ఇంద్రయోగం ఏర్పడతాయి. ఈ శుభ యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి విష్ణుమూర్తి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. పురోగతి కూడా లభిస్తుంది. వ్యాపారులకి కూడా కలిసి వస్తుంది. సంతోషంగా జీవించవచ్చు.
వరూథిని ఏకాదశి నాడు ఈ శుభయోగాల వేళ ఏయే రాశుల వారికి కలిసి వస్తుంది, ఎవరు ఎటువంటి ప్రయోజనాలని పొందుతారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏకాదశి వేళ శుభ యోగాల కారణంగా కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఏర్పడి సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి, సంతోషంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు.
వృషభ రాశి వారికి ఈ శుభ సమయంలో ఆదాయం పెరుగుతుంది. సానుకూల ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగులకి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా ఉంటాయి. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు వస్తాయి.
ధనస్సు రాశి వారికి ఈ శుభ సమయంలో ఆధ్యాత్మిక రంగాలపై ఆసక్తి కలుగుతుంది. ఏదైనా మార్గదర్శకత్వం కోసం చూస్తున్న వారికి సరైన అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనుకున్న పనులను టైంకి పూర్తి చేస్తారు.
వరూధిని ఏకాదశి నాడు వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ శుభయోగాల వేళ ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు కూడా ఉంటాయి. మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
మీన రాశి వారికి వరూధిని ఏకాదశి వేళ శుభ ఫలితాలు ఉంటాయి. ప్రయత్నాల్లో విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. మానసికంగా బలంగా ఉండడంతో పాటుగా అప్పులని తిరిగి చెల్లించడం, వ్యాపారంలో లాభాలు వంటివి చూస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.