TV Vastu: వాస్తు ప్రకారం టీవీ ఏ దిశలో ఉండాలి? ఇటు ఉంటే ప్రేమానురాగాలు పెరుగుతాయి, సంతోషంగా ఉండొచ్చు-tv vastu tips keep it in this direction for happiness and positivity ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tv Vastu: వాస్తు ప్రకారం టీవీ ఏ దిశలో ఉండాలి? ఇటు ఉంటే ప్రేమానురాగాలు పెరుగుతాయి, సంతోషంగా ఉండొచ్చు

TV Vastu: వాస్తు ప్రకారం టీవీ ఏ దిశలో ఉండాలి? ఇటు ఉంటే ప్రేమానురాగాలు పెరుగుతాయి, సంతోషంగా ఉండొచ్చు

Peddinti Sravya HT Telugu

TV Vastu: వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి కలుగుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం టీవీ ఎటు వైపు ఉండాలి? టీవీని ఇంట్లో పెట్టేటప్పుడు ఎలాంటి పొరపాట్లను చేయకూడదు వంటివి తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం టీవీ ఏ దిశలో ఉండాలి? (pinterest)

వాస్తు ప్రకారం పాటించడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి కలుగుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మన ఇంట్లో చాలా వస్తువులని మనం వాస్తు ప్రకారం ఉంచుతాము.

వాస్తు ప్రకారం అలా ఉంచడం వలన ఎటువంటి దోషాలు ఉండవు. సానుకూల శక్తి వ్యాపించి, సంతోషంగా ఉండచ్చు. కొన్ని దిశల్లో కొన్ని వస్తువులను పెట్టడం తప్పు. అలా చేయడం వలన ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. టీవీని ఏ దిశలో ఉంచాలి? టీవీని సరైన దిశలో ఉంచకపోతే ఎటువంటి నష్టాలు వస్తాయి వంటి విషయాలని తెలుసుకుందాం.

పడక గదిలో టీవీ ఉండవచ్చా?

  1. వాస్తు నియమాల ప్రకారం, పడక గదిలో టీవీ ఉండడం మంచిది కాదు. ఇలా ఉండడం వలన భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.
  2. ఒకవేళ కనుక మీరు టీవీని పడకగదిలో పెట్టినట్లయితే ఆగ్నేయం వైపు ఉంచడం మంచిది. అలా చేయడం వలన సానుకూల శక్తి కలుగుతుంది.
  3. రాత్రిపూట టీవీని ఒక క్లాత్ తో కవర్ చేయడం మంచిది. పడకగది ఎప్పుడూ కూడా ప్రశాంతంగా, రిలాక్స్డ్ గా ఉండాలి.

పని చేయని లేదా విరిగిపోయిన టీవీ

ఇంట్లో ఎప్పుడు కూడా పని చేయని టీవీ ఉండకూడదు. అది ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. దూరం చేస్తుంది. టెన్షన్ ని పెంచుతుంది. కాబట్టి ఇటువంటి టీవీలను ఇంట్లో నుంచి తొలగించడం మంచిది.

టీవీని ఏ దిశలో ఉంచితే మంచిది?

టీవీని లివింగ్ రూమ్ లో పెట్టుకోవడం మంచిది. ఇంట్లో రెండు కంటే ఎక్కువ టీవీలు ఉండకుండా చూసుకోండి. అలా ఉన్నట్లయితే ప్రతికూల శక్తి కలుగుతుంది. లివింగ్ రూమ్ లో కూడా టీవీ ఆగ్నేయం వైపు ఉంటేనే మంచిది.

ఒకవేళ కనుక పాత టీవీలు, పనికిరాని టీవీలు ఇంట్లో ఉంటే టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీవీ ఎప్పుడూ దక్షిణం వైపు ఉండకుండా చూసుకోండి. ఇది యముడి దిశ. కనుక ఈ వైపు టీవీ ఉండడం మంచిది కాదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం