Tulasi vivah 2024: కార్తీకమాసంలో తులసి వివాహం ఎప్పుడు చేయాలి, పూజా సామాగ్రి ఏంటి తెలుసుకుందాం-tulasi vivah 2024 date timings and samagri list for puja ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tulasi Vivah 2024: కార్తీకమాసంలో తులసి వివాహం ఎప్పుడు చేయాలి, పూజా సామాగ్రి ఏంటి తెలుసుకుందాం

Tulasi vivah 2024: కార్తీకమాసంలో తులసి వివాహం ఎప్పుడు చేయాలి, పూజా సామాగ్రి ఏంటి తెలుసుకుందాం

Ramya Sri Marka HT Telugu
Nov 10, 2024 05:03 PM IST

Tulsi vivah 2024: ప్రతి సంవత్సం కార్తీకమాసం శుక్లపక్ష ఏకాదశి లేదా ద్వాదశి రోజున తులసికి వివాహం జరిపిస్తారు. ఏ ఏడాది కార్తీకమాసంలో ఏకాదశి ఏ తేదీన వస్తుంది. ఆరోజు ఏ సమయంలో తులసికి వివాహం జరిపించాలి. పూజలకు ఎలాంటి సామాగ్రి కావాలో ఇక్కడ తెలుసుకుందాం.

తులసి వివాహం
తులసి వివాహం

హిందూపురాణంలో మొక్కలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చాలా రకాల చెట్లను పవిత్ర వృక్షాలుగా భావించి పూజిస్తుంటారు. అందులో తులసి మొక్క అన్నింటికన్నా ముఖ్యమైనది. లక్ష్మీ దేవి అవతారంగా భావించే తులసి మొక్క పూజతోనే రోజు ఆరంభిస్తుంటారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో మరింత భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. చాలా పవిత్రమైనదిగా భావించి ఆరాధించే తులసికి ప్రతి ఏడాది కార్తీకమాసంలో వచ్చే 12వ రోజున వివాహం జరిపిస్తారు. ఆ రోజున తులసీమాత శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది. ఈ రోజు నుంచే పెళ్లిల్లు, ఇతర శుభకార్యాలు ప్రారంభమవుతాయి. శాస్త్ర ప్రకారం.. ఈ రోజుతోనే వర్షాకాలం ముగిసిపోతుందనీ.. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుందని చెబుతుంటారు. ముఖ్యంగా తులసి వివాహం రోజునే చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ప్రాముఖ్యత చూపిస్తారు.

పురాణాల ప్రకారం తులసి మాత, శాలిగ్రామ రాయి రూపంలో ఉన్న విష్ణుమూర్తిల వివాహాన్ని సక్రమంగా నిర్వహించే వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో తులసి వివాహ పూజ కార్యక్రమంలో పాల్గొంటే సంతానం కలుగుతుందట. ఇంట్లో శాంతి వాతావరణం నెలకొనడంతో పాటు, సుఖ సంతోషాలతో ఆశీర్వదించబడతారని నమ్మిక. అంత ప్రాముఖ్యత కలిగి ఉన్న తులసి వివాహం ఈ ఏడాది ఏ తేదీన జరుపుకోవచ్చు. తులసి, శాలిగ్రాముల వివాహానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటి వంటి కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

తులసి వివాహం ఎప్పుడు జరిపించాలి?

ద్రిక్ పంచాంగం ప్రకారం.. కార్తీకమాసంలో వచ్చే శుక్ల పక్షం ద్వాదశి తిథి 12 నవంబరు 2024 రోజున సాయంత్రం 04:04 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే మరుసటి రోజు అంటే 13 నవంబరు 2024 రాత్రి 01:01 గంటలకు ముగుస్తుంది. అందువల్ల తులసి వివాహ కార్యక్రమం 13 నవంబరు 2024న జరుపుకోవాలి. తులసీమాతా - శాలిగ్రామ భగవంతుడికి ప్రదోషకాలంలోనే పెళ్లి చేయాల్సి ఉంటుందని చెబుతుంటారు.

తులసి వివాహానికి కావాల్సిన సామాగ్రి:

పవిత్ర తులసి, శాలిగ్రామ భగవంతుడి వివాహ కార్యక్రమం కోసం వీటిని సిద్ధం చేయాలి. పూజించేందుకు తులసి మొక్క, శాలిగ్రామ రాయి, విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫొటో, పూజా చౌకీ, ఎరుపు రంగు వస్త్రం, కలశం, అరటి ఆకు, పసుపు ముద్ద, గంధం, రోలి, నువ్వులు, మౌళి, ధూపం, దీపం వంటివి సమకూర్చుకోవాలి. ఆ తర్వాత తులసిమాతను అందంగా అలంకరించేందుకు కావాల్సినవి (బొట్టు, ఎరుపు చునారి, కుంకుమ, గోరింటాకు, కుంకుమ, చీర మొదలైనవి అవసరం). వీటితో పాటే చెరుకు, దానిమ్మ, అరటి, సింఘాడ, ముల్లంగి, ఉసిరి, మామిడి ఆకు, కొబ్బరి, అష్టదళ తామర, చిలగడదుంప, గంగాజలం, సీతాఫలం, జామ, కర్పూరం, పండ్లు, పూలు, బటాషా, స్వీట్లు మొదలైనవి అవసరం. ఇంటిని శుభ్రం చేసుకుని తులసి చెట్టును రంగులరంగుల పువ్వులు, ముగ్గులతో అలంకరించాలి.

Whats_app_banner