Tulasi: ఈ పరిహారంతో పేదరికాన్ని తరిమియేవచ్చు.. కొత్త సంవత్సరం ఇలా చేస్తే, సంపద కలిగి సంతోషంగా ఉండొచ్చు-tulasi root remedy for happiness do this on new year and get rid from money related problems and stay happy with wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tulasi: ఈ పరిహారంతో పేదరికాన్ని తరిమియేవచ్చు.. కొత్త సంవత్సరం ఇలా చేస్తే, సంపద కలిగి సంతోషంగా ఉండొచ్చు

Tulasi: ఈ పరిహారంతో పేదరికాన్ని తరిమియేవచ్చు.. కొత్త సంవత్సరం ఇలా చేస్తే, సంపద కలిగి సంతోషంగా ఉండొచ్చు

Peddinti Sravya HT Telugu
Dec 27, 2024 01:30 PM IST

Tulasi: గణేశుడుని పూజించడంతో పాటుగా మొదటి రోజు ఇలా చేయడం మంచిది. వీటిని కనుక మీరు మొదటి రోజు అనుసరించినట్లయితే, లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది. సంవత్సరం పాటు లక్ష్మీదేవి మీ ఇంట ధనాన్ని కురిపిస్తుంది. సంతోషంగా జీవించొచ్చు.

Tulasi: ఈ పరిహారంతో పేదరికాన్ని తరిమియేవచ్చు
Tulasi: ఈ పరిహారంతో పేదరికాన్ని తరిమియేవచ్చు (pinterest)

హిందువులు తులసి మొక్కని ఆరాధిస్తారు. తులసి మొక్కని ఆరాధించడం వలన కాసుల వర్షం కురుస్తుందని.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అప్పులు బాధలు తీరిపోయి, లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు అని భావిస్తారు. కొత్త సంవత్సరం మొదటి రోజు మీరు ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం అంతా సంతోషంగా ఉండడానికి.. డబ్బులు బాగా ఇంటికి రావడానికి ఇలా చేయవచ్చు.

yearly horoscope entry point

2025 ఇంకా కొన్ని రోజులలో వచ్చేస్తోంది. 2024 పూర్తయిపోతుంది. అయితే, హిందువులు మొట్టమొదట గణేశుడని ఆరాధిస్తారు. గణేషుడికి తొలి పూజ చేయాలి అని నమ్ముతారు. ఏ పూజ చేసినా మొట్టమొదట మనం వినాయకుడిని ఆరాధిస్తాము.

గణేశుడుని పూజించడంతో పాటుగా మొదటి రోజు ఇలా చేయడం మంచిది. వీటిని కనుక మీరు మొదటి రోజు అనుసరించినట్లయితే, లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది. సంవత్సరం పాటు లక్ష్మీదేవి మీ ఇంట ధనాన్ని కురిపిస్తుంది. సంతోషంగా జీవించొచ్చు.

తులసి మొక్క

తులసి మొక్కని ప్రతి రోజు మనం పూజిస్తూ ఉంటాము. తులసి కోట ముందు దీపాన్ని వెలిగిస్తాము. దానితో పాటు ఈ పరిహారాన్ని పాటించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. లక్ష్మీదేవి నిత్యం మీ ఇంట కొలువై ఉంటుంది. తులసి మొక్కని పూజించడంతో పాటుగా ఈ పరిహారాన్ని పాటించినట్లయితే డబ్బుకి లోటు ఉండదు.

తులసి వేరుతో ఇలా చేయండి

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి తులసి వేరుని కడితే చాలా మంచి జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. పేదరికం నుంచి కూడా బయటపడడానికి అవుతుంది. పైగా ఏ ఇంట అయితే తులసి వేరుని కడతారో, ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అప్పుల బాధల నుంచి కూడా సులువుగా బయటపడడానికి అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించొచ్చు.

తులసి వేరుని ఇంటికి కట్టే పద్దతి:

  1. మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ పరిహారాన్ని పాటించండి. అప్పుడు లక్ష్మీదేవిని వెళ్ళిపోకుండా ఆపవచ్చు.

2. తులసి వేరుని ఎర్రటి వస్త్రంలో ఉంచి కొన్ని అక్షతలను అందులో వేసే కట్టాలి.

3. దానిని బాగా గట్టిగా కట్టిన తర్వాత ప్రధాన ద్వారానికి కట్టాలి.

4. ఇలా చేయడంతో పాటుగా లక్ష్మీదేవి పాదాల చిహ్నాన్ని కానీ స్వస్తిక్ చిహ్నాన్ని కానీ తలుపు మీద పెట్టండి. ఇలా వీటిని మీరు అనుసరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం