శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా
గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోండి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు నుంచి దూరంగా ఉండాలి.
15.5.25 నుంచి 19.10.25 వరకు, మళ్ళీ 6.12.25 నుండి సంవత్సరం చివరి గురుడు మిథునంలో ఉంటాడు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధన లాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికం అవుతాయి.
20.10.25 నుండి 5.12.25 వరకు కర్కాటకంలో ఉంటాడు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.
రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు మీనంలో ఉంటాడు. మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. పిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్యలో ఉంటాడు. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి సత్ఫలితాలను ఇచ్చును. వ్యాపారస్తులకు ధన లాభము, వ్యాపారాభివృద్ధి జరుగును. ఈ సంవత్సరం తులా రాశి వారికి మంచి ఆదాయం, అభివృద్ధి సూచించుచున్నవి.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. గృహ మార్పులు ఉంటాయి. వృధా ఖర్చులు కూడా. దేవాలయ దర్శనము చేయుదురు. క్రయవిక్రయాల్లో లాభములుంటాయి. మిత్రులు శత్రువులుగా మారెదరు. అధికార ఒత్తిడి ప్రతి విషయంలో ఆలోచనలు.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. ధనలాభం, వ్యాపారంలో మంచి అభివృద్ధి, తలపెట్టిన పనులు నెరవేరును. గృహ నిర్మాణ పనులు పూర్తగును. బంధు విరోధములుంటాయి. వివాహ ప్రయత్నములు, పనులు పూర్తి చేస్తారు. శత్రు జయము.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. తీర్థయాత్రలు చేస్తారు. వస్తువులు, ఆభరణములు కొంటారు. సంతానపరంగా ధన వ్యయము. దేవాలయ దర్శనం చేస్తారు. స్థిరాస్తి విక్రయము. స్నేహితులు శత్రువులుగా మారును. ప్రమాద సూచనలున్నాయి. అనారోగ్య సమస్యలుంటాయి.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. వ్యవసాయములో చిక్కులు, గొడవలు వచ్చును. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలం. ఆదాయమునకు మించిన ఖర్చులుంటాయి. వాహన భయము. కొత్త ప్రయత్నాలు ఫలించును.
ఈ మాసం మీకు అన్ని విధాలుగా కలసివచ్చును. నూతన వస్త్రములు కొంటారు. మానసిక ఆలోచనలు చేయుదురు. కొన్ని అవమానాలుంటాయి.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంఘములో గౌరవం ఉంటుంది. విపరీతమైన కోపము. మాట పట్టింపులుంటాయి. ఆరోగ్యంలో స్వల్ప లోపములు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాక.
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మానసికాందోళన. గౌరవ హాని, కార్యహాని. ఇంటా బయటా విరోధములు ఉంటాయి. అధికార ఒత్తిడి. పనుల్లో ఆటంకాలు. స్నేహితులు కలసివచ్చును.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అన్ని పనులలో ఆటంకాలు. వ్యాపార, వ్యవసాయపరంగా అనుకూలించును. వాహనము కొంటారు. మానసికాందోళన. దూర ప్రయాణాలుంటాయి. ప్రేమ అనుకూలించును. ధనపరంగా స్వల్ప ఇబ్బందులు.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. భూమి తగాదాలు. గర్వము పెరుగును. శారీరక అలసట. శుభకార్యములు చేస్తారు. ప్రముఖులతో సంభాషణ. సంఘములో రాజీనామాలు చేస్తారు. ఒప్పందాలకు అనుకూలం. తోబుట్టువులతో విరోధాలు.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శుభకార్యాలకు ధనం విరివిగా ఖర్చు చేస్తారు. వాహన ప్రమాదాలుంటాయి. దైవదర్శనము. ఇతరుల వలన ఇబ్బందులు పడతారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవమానపడతారు.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టము, స్త్రీ అపవాదులుంటాయి. వినోదాలకై ధనం ఖర్చు చేస్తారు. శుభకార్యములలో పాల్గొంటారు. పోలీసులతో గొడవలు పెరుగును. ఖర్చులు అధికమగును. మీ తెలివితేటలతో జాగ్రత్తగా ముందుకు వెళ్తారు.
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. పుణ్య నదీ స్నానాలు చేస్తారు. సంతానపరంగా ఖర్చులు. రుణ ప్రయత్నాలు కలసివచ్చును. వస్తు సామాగ్రి కొంటారు. నరఘోష అధికమగును. పదవులు, సభ్యత్వాలు వచ్చును. గౌరవముంటుంది. అనారోగ్య సమస్యలు.
సంబంధిత కథనం