Tula Rasi Today: ఈరోజు తులా రాశి వారికి ఊహించని ట్విస్ట్‌లు, సాయంత్రానికి ఒక శుభవార్త వింటారు
Libra Horoscope Today: రాశి చక్రంలో 7వ రాశి తులా రాశి. పుట్టిన సమయంలో తులా రాశిలో సంచరిస్తున్న జాతకుల రాశిని తులారాశిగా పరిగణిస్తారు. ఈరోజు తులా రాశి వారి కెరీర్, ప్రేమ, ఆరోగ్య, ఆర్థిక జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
Tula Rasi Phalalu 27th August 2024: ఈరోజు తులా రాశి వారి ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వృత్తి జీవితంలో సానుకూల దృక్పథం కనిపిస్తుంది. పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి. మీరు ఆర్థికంగా సంవృద్ధి చెందుతారు, ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవు.
ప్రేమ
ఈ రోజు మీ ప్రేమ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. జీవితంలో ఏం కావాలన్నా ఆ కలలన్నీ నెరవేరుతాయి. రొమాంటిక్ లైఫ్‌లో కొత్త ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లు ఉంటాయి. సంబంధాల్లో ప్రేమ, అనుబంధం పెరుగుతాయి. ఒంటరి జాతకులు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుస్తారు. మీ ప్రేయసిని జాగ్రత్తగా చూసుకోండి. గత సమస్యలను తెలివిగా పరిష్కరించుకోండి.
ఈ రోజు మీ ప్రేమ వ్యవహారానికి తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. కొంత మంది తులా రాశి జాతకుల వివాహం కూడా నిశ్చయం కావచ్చు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్‌లో ఉన్నవారు తమ భాగస్వామితో ఎక్కువ సమయం గడిపి వారితో సంభాషణ ద్వారా రిలేషన్ షిప్ సమస్యలను పరిష్కరించుకుంటారు.
కెరీర్
తులా రాశి వారికి ఈ రోజు చాలా లాభదాయకమైన రోజు. ఆఫీస్ మేనేజ్‌మెంట్ మీపై పాజిటివ్ ఇమేజ్‌తో ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ పర్సన్ ప్రొఫైల్ మెరుగ్గా ఉంటుంది. సీనియర్ల సహకారంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. నోటీస్ పీరియడ్‌లో ఉన్నవారికి సాయంత్రానికి శుభవార్త అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు.
ఆర్థిక
ఈ రోజు మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. డబ్బు వచ్చినప్పటికీ కష్టాల నుండి బయటపడటానికి డబ్బును పొదుపు చేయండి. కొంతమంది ద్విచక్రవాహనం కోసం షాపింగ్ చేయవచ్చు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విదేశీ ఖాతాదారుల నుంచి చెల్లింపులు అందుతాయి.
వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ రోజు దానధర్మాలకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రోజు ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బుని అప్పుగా ఇవ్వొద్దు
ఆరోగ్యం
తులా రాశి వారికి ఈ రోజు కీళ్ల నొప్పులు రావచ్చు. సీనియర్లకు నిద్రలేమి సమస్యలు వస్తాయి. స్త్రీలు స్త్రీ జననేంద్రియ వ్యాధుల సమస్యతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీరు ఎక్కువగా తాగాలి. మీ ఆహారంలో కూరగాయలు, పండ్లను చేర్చండి. కాలేయం, ఛాతీ సమస్యల పట్ల నిర్లక్ష్యం వద్దు. ఈ రోజు, పిల్లలు ఆడుకునేటప్పుడు గాయపడవచ్చు.