తులా రాశి వార ఫలాలు: ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఎలా ఉండనుంది? అలాంటి పనులు మానుకోండి, ఆర్థికాభివృద్ధికి ఇలా చేయండి!-tula rashi libra weekly horoscope predictions 27th april to 3rd may 2025 in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  తులా రాశి వార ఫలాలు: ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఎలా ఉండనుంది? అలాంటి పనులు మానుకోండి, ఆర్థికాభివృద్ధికి ఇలా చేయండి!

తులా రాశి వార ఫలాలు: ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఎలా ఉండనుంది? అలాంటి పనులు మానుకోండి, ఆర్థికాభివృద్ధికి ఇలా చేయండి!

Sanjiv Kumar HT Telugu

తులా రాశి వార ఫలాలు: రాశి చక్రంలో తులా రాశి ఏడవది. జన్మించిన సమయంలో తులా రాశిలో చంద్రుడు సంచరించిన జాతకులను తులా రాశి వారిగా పరిగణిస్తారు. దీనికి చిహ్నం తూనిక లేదా కొలమానం. అయితే, తుల రాశి వారి జాతకం ఈ వారం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

తులా రాశి వార ఫలాలు: ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఎలా ఉండనుంది? అలాంటి పనులు మానుకోండి, ఆర్థికాభివృద్ధికి ఇలా చేయండి!

మీ మనసులో మాటను గట్టిగా చెప్పాలనుకుంటే తులా రాశి వారికి ఈ వారం కలిసిరానుంది. ఈ సంఘటనలన్నీ మీ జీవితంలో సమతుల్యతను తెస్తాయి. ఎలాంటి సంకోచం లేకుండా ఈ అభిప్రాయలను తెలియజేయండి. మీ మనసు చెప్పే మాటను నమ్మండి. అది చాలా శక్తివంతమైనదని నమ్మకం ఉంచండి. ప్రశాంతంగా ఉండండి.

తులారాశి ప్రేమ రాశిఫలం

మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి కొన్నిసార్లు మీ అవసరాలు పూర్తిగా గౌరవించబడటం లేదని అనిపిస్తుంది. కొన్నిసార్లు తగినంత స్పేస్, ఎక్కువగా అర్థం చేసుకోవాలని, అంతకంటే ఎక్కువగా నిజాయితీ ఉండాలని భావిస్తారు. మీరు ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఉంటే వారితో నేరుగా మాట్లాడండి. కానీ, మృదువుగా హ్యాండిల్ చేయండి. మీరు ప్రశాంతంగా చెబితేనే మీ భాగస్వామి బాగా అర్థం చేసుకుంటారు.

ఒకవేళ మీరు సింగిల్ అయితే ఇతరులతో మీరు నిజాయితీగా ఉండటం వల్ల సంతోషపడతారు. మీ నిజమైన ఆలోచనలు, భావోద్వేగాలను దాచకుండా మీ ప్రేమను సహజంగా పంచండి.

తులారాశి కెరీర్ రాశిఫలం

కెరీర్‌ పరంగా మీ కచ్చితమైన అభిప్రాయం ఏంటో తెలుసుకునే, చెప్పే పరిస్థితి ఎదురవుతుంది. అది ఒక ఆలోచన కావచ్చు, లేదా ఒక పని, లేదా ఎవరైనా సహోద్యోగితో ఏర్పవచ్చు. నాయకత్వాన్ని ప్రదర్శించడానికి ఏమాత్రం భయపడకండి. మీరు ఇతరులను కమ్యునికేట్ చేయడంలోనే మీ అసలైన బలం ఉందని గుర్తుంచుకోండి.

మీరు చెప్పాలనుకుంటుంద ఏంటో స్పష్టంగా చెప్పిండి. కానీ, మెల్లిగా, దయతో చెప్పండి. ప్రజలు మీలోని కామ్‌గా ఉండే కాన్ఫిడెన్స్‌ను గౌరవిస్తారు. ఆఫీసు విషయాలు, గుసగుసలు లేదా ఇతరులను జడ్జ్ చేసే వంటి వాటిని మానుకోండి. మీ లక్ష్యం వైపు మాత్రమే కృషి చేయండి, దృష్టి పెట్టండి.

తులారాశి డబ్బు రాశిఫలం

డబ్బు, ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంది. అయితే, ఇతరులను సంతోషపెట్టడానికి లేదా మీపై ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేయడానికి ఏదైనా ఖర్చు చేయాలనే భావన కలుగుతుంది. కానీ, అలా చేయకండి. మీకు నిజంగా అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయండి.

బడ్జెట్ గురించి దీర్ఘకాలికంగా ఆలోచించడం సహాయపడుతుంది. అయితే, ఇదివరకు తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ప్రశ్నార్థకంగా మారవచ్చు. కాబట్టి దాని ఖర్చు విషయంలో తెలివిగా ఆలోచించి వ్యవరించండి. మీ ఆర్థికాభివృద్ధి అంతా మీరు భవిష్యత్తుకు ఉపయోగపడే అవసరాలు, మనసు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

తులారాశి ఆరోగ్య రాశిఫలం

తుల రాశి వారికి పలు ఈ వారం ఆరోగ్యం బాగుటుంది. కానీ, ఓవర్ థింకింగ్ చేయకండి. నడవటం, శరీర వ్యాయామం లేదా తేలికపాటి సంగీత నృత్యం వంటివి చేయడం ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

తేలికపాటి ఆహారం, ఎక్కువగా ఫ్లూయిడ్స్ వంటివి తీసుకోండి. కాఫీ అధికంగా తాగడం, ఎక్కువగా స్క్రీన్‌పై సమయం కేటాయించడం వంటివి చేయకండి. డ్రాయింగ్, రైటింగ్, వంట చేయడం వంటి క్రియేటివ్ పనులు చేయండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి దోహదపడుతుంది.

డాక్టర్ జె.ఎన్.పాండే (వేద జ్యోతిష్యం, వాస్తు నిపుణుడు)

ఇ- మెయిల్: djnpandey@gmail.com

ఫోన్: 91-911060 (వాట్సాప్ మాత్రమే)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.