Tuesday Remedies: మంగళవారం నాడు ఈ పరిహారాలను పాటిస్తే.. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు తీరుతాయి-tuesday remedies do these for lord hanuman blessings and even financial growth will be there and may get success ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tuesday Remedies: మంగళవారం నాడు ఈ పరిహారాలను పాటిస్తే.. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు తీరుతాయి

Tuesday Remedies: మంగళవారం నాడు ఈ పరిహారాలను పాటిస్తే.. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు తీరుతాయి

Peddinti Sravya HT Telugu
Published Feb 17, 2025 12:00 PM IST

Tuesday Remedies: మంగళవారం నాడు హనుమంతుడి ఆశీస్సులు పొందడానికి, హనుమంతుని అనుగ్రహం కలగడానికి ఏం చేయాలి? కష్టాల నుంచి బయటపడడానికి హనుమంతుడిని ఎలా ఆరాధించాలి? సింధూరంతో చేయాల్సిన పరిహారాలను కూడా తెలుసుకుందాం.

Tuesday Remedies: మంగళవారం నాడు ఈ పరిహారాలను పాటిస్తే హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది
Tuesday Remedies: మంగళవారం నాడు ఈ పరిహారాలను పాటిస్తే హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది

చాలా మంది హనుమంతుడి ఆశీస్సులు కలగాలని, మంగళవారం నాడు ప్రత్యేకించి హనుమంతుడిని ఆరాధిస్తారు. హనుమంతుడికి మంగళవారం అంటే ఎంతో ప్రీతి. మంగళవారం నాడు హనుమంతుడని ఆరాధించడం వలన కుటుంబంలో సంతోషాలు కలుగుతాయి.

మంగళవారం నాడు హనుమంతుడి ఆశీస్సులు పొందడానికి, హనుమంతుని అనుగ్రహం కలగడానికి ఏం చేయాలి? కష్టాల నుంచి బయటపడడానికి హనుమంతుడిని ఎలా ఆరాధించాలి? వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

హనుమంతుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం నాడు తమలపాకులతో లేదా సింధూరంతో హనుమంతుడిని పూజించడం వలన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుడుకి సింధూర పూజ ప్రధానం. హనుమంతుడికి సింధూరం అంటే ఇష్టం అన్న విషయం మనకు తెలుసు. దాని వెనక పెద్ద కారణం ఉంది.

హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ఇష్టం?

సీతమ్మవారిని హనుమంతుడు దర్శించినప్పుడు, ఆమె పాపిట్లో సింధూరం ఉంటుంది. అప్పుడు సీతమ్మవారిని సింధూరం ధరించడం వెనుక కారణం అడిగితే, అప్పుడు ఆమె శ్రీరాముని క్షేమం, ఐశ్వర్యాలు కలగడం కోసం సింధూరాన్ని ధరిస్తానని చెప్తుంది. అప్పుడు హనుమంతుడు కేవలం సీతమ్మవారు పాపిట సింధూరం ధరిస్తేనే రాముడికి అంత మంచి జరుగుతుందంటే ఒళ్లంతా సింధూరం ధరించాలని.. ఆయన అలా ఒళ్లంతా సింధూరం పూసుకుంటారు.

రాముడికి మంచి జరగాలన్న ఉద్దేశంతోనే హనుమంతుడు సింధూరాన్ని ఒళ్లంతా పూసుకుంటాడు. పైగా సింధూరం మామూలుగా రాసుకుంటే రాలిపోతుందని, నువ్వుల నూనెలో కలిపి ఆయన ఒళ్లంతా సింధూరని పూసుకుంటారట. అందుకని ఆంజనేయ స్వామి పూజలో సింధూరం ఎంతో ముఖ్యం.

హనుమంతుడి అనుగ్రహం కోసం

హనుమంతుడు అనుగ్రహం కలగాలంటే గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆంజనేయ స్వామికి సమర్పించాలి. అలా చేస్తే హనుమంతుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.

మంగళవారం నాడు ఇలా చేస్తే ఆర్థిక బాధలు తీరుతాయి

మంగళవారం నాడు ఆర్థిక బాధల నుంచి బయటపడడానికి తలస్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, హనుమంతుడు ఆలయానికి వెళ్లి సింధూరాన్ని సమర్పించండి.

ఆ తర్వాత హనుమంతుడి ఎదుట హనుమాన్ చాలీసా చదువుకోండి. ఐదు మంగళవారాలు ఇలా చేశారంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. కష్టాల నుంచి బయట పడడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది.

విజయం కోసం ఏం చేయాలి?

జీవితంలో సక్సెస్ ని అందుకోవాలంటే ఈ పరిహారాన్ని పాటించొచ్చు. హనుమంతుడికి సింధూరం సమర్పించిన తరవాత, ఆ సింధూరాన్ని మీరు మీ నుదుటన పెట్టుకుంటే, మీరు పడే కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది.

Peddinti Sravya

eMail
Whats_app_banner

సంబంధిత కథనం